Madhu Yashki Goud: కేసీఆర్, హరీష్ జైలుకు వెళ్తారు: మధుయాష్కీ
Madhu Yashki Goud (Image Source: Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Madhu Yashki Goud: జైలుకు వెళ్లనున్న కేసీఆర్, హరీష్.. మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

Madhu Yashki Goud: మహాధర్నా సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కమిషన్ లతో బతికే వాళ్లకు విచారణ కమిషన్ కి… కమిషన్ కి తేడా ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. న్యాయబద్దంగా విచారణ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసిందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంజనీరింగ్ చదివినట్టు.. తానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు  చెప్పుకుంటున్నారని విమర్శించారు. పక్కా ఆధారాలతోనే కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు కాళేశ్వరంపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

కవితకు సన్ స్ట్రోక్
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో కూర్చున్నాక ఎమ్మెల్సీ కవితకు సన్ స్ట్రోక్ తగిలినట్లు ఉందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఎద్దేవా చేశారు. కవిత మెున్ననే జైలుకు వెళ్లి వచ్చారని.. త్వరలో కేసీఆర్, హరీష్ రావు కూడా కటకటాల్లోకి వెళ్లడం ఖాయమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వచ్చాకనే గోదావరీ.. కృష్ణ నదులు పుట్టినట్టు కవిత మాట్లాడుతున్నారని.. కవిత ఏం చదువుకుందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఆమెకు డ్యామ్ – టన్నెల్ కు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? అని మధుయాష్కీ ప్రశ్నించారు. మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్లతో వాదించడం వృథా అని కవితను ఉద్దేశించి అన్నారు.

Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో ఫస్ట్ ట్రోఫీ.. కెప్టెన్‌కు కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్.. వీడియో వైరల్!

బిల్ పాస్‌పై డాక్యుమెంటరీ
తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంటులో ఏనాడు కేసీఆర్ మాట్లాడలేదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు. అప్పటి బీఆర్ఎస్ నేత విజయశాంతి (Vijaya Shanthi) మాత్రమే తెలంగాణ గురించి పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్ పాస్ అవ్వడం వెనక జరిగిన పోరాటంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సీనియర్ నాయకులు జానారెడ్డి (Jana Reddy), కేకే గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), విజయశాంతి తో డాక్యుమెంటరీ మేకర్స్ సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. బిల్ పాస్ అవ్వడంతో సోనియా గాంధీ (Sonia Gandhi) చొరవ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముందని మధుయాష్కీ అన్నారు.

Also Read This: Punjab Youtuber Arrested: పాక్‌తో లింకులు.. మరో యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Just In

01

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”