CPI Narayana on Pawan Kalyan: సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని అని అన్నారు. సీపీఐ నారాయణ వీడియోను రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read: MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!
పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్
ఆయన మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ మూడు పెండ్లిళ్లు గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత నేను కామెంట్స్ చేసిన మాట నిజమే. అయితే, నా కొటేషన్ తీసుకుని మూడు పెళ్ళిళ్ళు అనే మాట పట్టుకుని అందరూ నా మీద రివర్స్ అవుతున్నారు. నేను సూటిగా ఒక్కటే అడుగుతున్నాను.. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? అనేది చెప్పండి. ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, సనాతన ధర్మంలో విడాకులు అనేది లేదని అన్నారు.
Also Read: Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?
ఇంకా మాట్లాడుతూ” సనాతన ధర్మంలో ఒకసారి పెళ్ళైన తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత చెడు పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలి, భర్తను వ్యతిరేకిస్తే ఏం కలిసి రాదు. అలాగే, భర్త చనిపోతే అదే చితిమంటలో భార్యను కూడా తగలబెడతారనేది దాని సారాంశమని నారాయణ అన్నారు. వీటిని పట్టించుకుని మాట్లాడినప్పుడు.. పవన్ కళ్యాణ్ విడాకులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ తెలిపారు. సనాతన ధర్మాన్ని సమర్దించే వారు ఎవరైనా , పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలని” ఆయన అన్నారు.
Also Read: Kamal Haasan: హై కోర్టు తీర్పు తర్వాత.. సంచలన నిర్ణయం తీసుకున్నకమల్ హాసన్.. షాక్ లో ఫ్యాన్స్