Allu Ayaan on RCB Win
ఎంటర్‌టైన్మెంట్

Allu Ayaan: ఆర్సీబీకి తొలి కప్.. అల్లు అయాన్‌కి ఏమైంది? వీడియో వైరల్!

Allu Ayaan: ఎప్పుడెప్పుడా అని కళ్లలో నీళ్లు పెట్టుకుని మరీ వేచి చూస్తున్న రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ అభిమానుల కల నెరవేరింది. కింగ్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఏదయితే ఉందో, ఆ నెంబర్ టైమ్‌లోనే కింగ్ కోహ్లీ కల కూడా తీరింది. ఎప్పుడూ కోహ్లీ పేరు ప్రస్తావన వచ్చినా, వినబడే లోటు, ట్రోల్ చేసే థాట్‌కి ఆస్కారం ఇచ్చే అంశాన్ని.. ఈసారి ఆర్సీబీ జట్టు అధిగమించింది. 18వ ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోపీని అందుకుని.. ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇంకా నాలుగు బంతులు పంజాబ్ ఆడాల్సి ఉన్నప్పుడే ఆర్సీబీ విజయం ఖరారైంది. గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ కళ్లు కన్నీటి పర్యంతమయ్యాయి. అది చూసిన ఒక్కో అభిమాని ఎమోషన్‌లో మునిగిపోయారు. ఎప్పుడైతే లాస్ట్ బాల్ పడిందో.. ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read- Actress Laya: బాలయ్య అంత పని చేశాడా? షాకింగ్ విషయం చెప్పిన నటి లయ!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ (Virat Kohli) అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు (RCB Fans) అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి సంబరాలు అంబరాన్ని అంటేలా రచ్చ రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. వారి ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అక్కడ ఇక్కడ అని కాదు.. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కోహ్లీ అభిమానులు టపాసులతో ‘దీపావళి’ని తలపించారు. ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కింగ్ కోహ్లీ కప్‌ని ముద్దాడుతున్న ఫొటోలు నెట్ ప్రపంచాన్ని కమ్మేశాయి. క్రికెట్‌ని ప్రేమించే ప్రేమికులందరూ ఆర్సీబీ తొలి టైటిల్ పట్ల సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షల వర్షం కురిపించారు. అందులో సినీ ప్రముఖులెందరో ఉన్నారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నివేదా థామస్ ఇలా ఆర్సీబీని, కోహ్లీని అభిమానించే వారంతా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

Also Read- Nagarjuna Family: అక్కినేని ఇంట్లో గొడవలా? అఖిల్ పెళ్లి వేళ చైతూ సంచలన నిర్ణయం!

అందులోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్ ప్రపంచాన్ని బాగా ఆకర్షించింది. ఇంతకీ అల్లు అర్జున్ ఏం వీడియో షేర్ చేశారని అనుకుంటున్నారా? అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌.. కింగ్ కోహ్లీకి సూపర్‌ ఫ్యాన్‌. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్ విజయం సాధించిన వేళ నిజమైన అభిమాని ఎమోషన్ ఎలా ఉంటుందో.. అలా అల్లు అయాన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ మూమెంట్‌ని క్యాప్చర్ చేసిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేసి, తన అభిమానులకు కూడా సూపర్బ్ ట్రీట్ ఇచ్చాడు.

">

ఇక బన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో నిజంగా కింగ్ కోహ్లీ అభిమానులు ఎంత భావోద్వేగంతో ఉన్నారో అల్లు అయాన్ తన చేష్టలతో చూపించేశారు. ఆర్సీబీ గెలిచిన వెంటనే నేలపై బోర్లా పడుకుని ప్రార్థనలు చేశాడు. కళ్లలో ఎమోషనల్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తూ.. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించిందనే భావాన్ని ప్రదర్శించాడు. ఇంకా తలపై బాటిల్‌తో నీళ్లు కుమ్మరించుకొని అప్పటి వరకు ఎంత ఒత్తిడిని దాచుకున్నాడో తెలియజేశాడు. నిజంగా కోహ్లీకి ట్రూ ఫ్యాన్ బాయ్‌గా అల్లు అయాన్ ఈ వీడియోతో అందరి మనసులను దోచేశాడు. అందుకే అల్లు అర్జున్ ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు