Nagarjuna Family: కింగ్ నాగార్జున (King Nagarjuna) ఇంట్లో భయంకరమైన గొడవలు మొదలయ్యాయా? అంటే.. తాజాగా నాగ చైతన్య (Naga Chaitanya), శోభితలను ఎయిర్ పోర్ట్‌లో చూసిన వారంతా అవుననే చెబుతున్నారు. ఎందుకంటే, ఒకవైపు జైనాబ్‌తో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మ్యారేజ్ జూన్ 6న జరగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్లికి సంబంధించి కింగ్ నాగార్జున శుభలేఖలను కూడా పంచుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల కుటుంబ సమేతంగా వెళ్లి పెళ్లి పత్రిక ఇచ్చి, ఆహ్వానించిన విషయం తెలిసిందే. వారం, పది రోజులుగా నాగార్జున.. అఖిల్ పెళ్లి పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకు మాత్రం ఇంత వరకు అఖిల్ పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. కనీసం పెళ్లి డేట్ కూడా ఆ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. అయినా కూడా అఖిల్ పెళ్లి వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఇలా అఖిల్ పెళ్లి (Akhil Marriage) పనుల్లో అక్కినేని ఫ్యామిలీ తలమునకలై ఉంటే.. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య మాత్రం తన భార్య శోభితను తీసుకుని విదేశాలకు చెక్కేస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. అదేంటి? తమ్ముడి పెళ్లికి ఉండకుండా నాగ చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి? అంటే, అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి.. అందుకే, చైతూ తన భార్యని తీసుకుని విదేశాలకు వెళ్లిపోతున్నాడని అంతా మాట్లాడుకుంటున్నారు. మరికొందరైతే నాగార్జున, అఖిల్, నాగ చైతన్యల మధ్య భయంకరమైన గొడవలు జరుగుతున్నాయని, అందుకే చైతూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో స్పందిస్తుండటం విశేషం. మొత్తంగా అయితే అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family)లో మాత్రం పెద్ద రభస ఏదో జరుగుతుంది? అనేలా ఈ వీడియో హింట్ ఇస్తుండటాన్ని గమనించవచ్చు.
Also Read- Chiranjeevi: మీలాంటి ఒక అభిమాని వున్నందుకు గర్వంగా ఉంది.. చిరు ట్వీట్ వైరల్!
మరో వైపు ఈ పెళ్లి పనుల నిమిత్తమే వారిద్దరూ విదేశాలకు వెళుతున్నారని కూడా కొందరు కామెంట్స్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే, ఇంత వరకు అఖిల్ పెళ్లి ఎక్కడ అనేది క్లారిటీ రాలేదు. హైదరాబాద్, అన్నపూర్ణ స్టూడియోలో.. బంధువుల, సెలక్టెడ్ సెలబ్రిటీస్ మధ్య ఈ పెళ్లి జరగనుందని ఒకసారి, డెస్టినేషన్ వెడ్డింగ్ అని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్ పనులను చూసుకునేందుకే, వారిద్దరూ విదేశాలకు వెళుతున్నారని కొందరు అనుకుంటున్నారు. నిజంగా హైదరాబాద్‌లో పెళ్లి అయితే మాత్రం.. చైతూ తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే కచ్చితంగా ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నమ్మాల్సి ఉంటుంది. ఏ విషయం తెలియాలంటే మాత్రం నాగ్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ కావాల్సి ఉంది. అసలీ వార్తల్లో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.
#TFNExclusive: The lovely couple Yuvasamrat @chay_akkineni & @sobhitaD snapped together at Hyderabad airport as they’re back from their vacation!!❤️📸#NagaChaitanya #SobhitaDhulipala #SoChay #TeluguFilmNagar pic.twitter.com/dOVE5SISH2
— Subhodayam Subbarao (@rajasekharaa) June 3, 2025
ఈ వీడియోపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతుండగా.. ఆ ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవని, చైతూ-శోభిత వెకేషన్ ముగించుకుని వస్తున్న వీడియో అదని అక్కినేని అభిమానులు వివరణ ఇస్తున్నారు. తమ్ముడి పెళ్లి నిమిత్తం చైతూ తన భార్యతో వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారని అంటున్నారు. ఈ వీడియో కూడా వారిద్దరూ వెకేషన్ ముగించుకుని వస్తున్నట్లుగానే ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు