IPL Final Closing Ceremony (Image Source: Twitter)
స్పోర్ట్స్

IPL Final Closing Ceremony: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఈసారి ముగింపు వేడుకలు ధూమ్ ధామే!

IPL Final Closing Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 18వ ఎడిషన్ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. నెలన్నర రోజులకు పైగా క్రికెట్ లోకాన్ని అలరించిన ఐపీఎల్.. ఇవాళ జరిగే ఫైనల్స్ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకలను నిర్వహకులు ఘనంగా ఏర్పాటు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 6 గం.లకే క్లోజింగ్ సెర్మనీని ప్రారంభించనున్నారు. మ్యాచ్ జరగనున్న గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్డేడియం ప్రముఖుల మ్యూజిక్ షోలతో దద్దరిల్లనుంది.

సింగర్ తో స్పెషల్ షో
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ ఈ సెర్మనీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆయన తన కుమారులు శివమ్, సిద్ధార్థ్ మహదేవన్‌లతో కలిసి భారత సైన్యానికి నివాళిగా ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. ఈ ప్రదర్శన పహల్‌గామ్ దాడిలో అమరులైన వారిని స్మరించడంతో పాటు దేశభక్తిని ప్రేరేపించే లక్ష్యంతో రూపొందించబడింది. మహాదేవన్ పాడనున్న పాటల్లో ‘బ్రెథ్‌లెస్’, ‘మా తుజే సలామ్’ వంటి ఐకానిక్ సాంగ్స్ కూడా ఉండనున్నాయి.

Also Read: Jupally Krishna Rao: మిస్ వరల్డ్ భామలకు 30 తులాల బంగారం.. ప్లేట్ మీల్స్ రూ.లక్ష.. మంత్రి క్లారిటీ

సైనికులకు ప్రత్యేక ఆహ్వానం
ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్.. సైనికుల థీమ్ తో బీసీసీఐ ప్లాన్ చేసింది. సైనికుల ధైర్య సాహసాలను కీర్తిస్తూ ఆపరేషన్ సిందూర్ లో వారు ప్రదర్శించిన తెగువను హైలెట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సైనిక అధికారులకు బీసీసీఐ ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. స్టేడియంలో సైనికుల కోసం ప్రత్యేకంగా స్టాండ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రముఖ క్రీడా ఛానెల్.. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. అలాగే జియో హాట్ స్టార్ లో ఓటీటీలోనూ మ్యాచ్ ను లైవ్ లో చూడవచ్చు.

Also Read This: IPL 2025 Final: మరికొద్ది గంటల్లో ఫైనల్స్.. గెలిచేదెవరు.. ఇంటికెళ్లేది ఎవరు..?

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?