Serbian social media influencer (Image Source: Twitter)
Viral

Watch Video: ప్రపంచంలోనే వింతైన చావు.. చూస్తే షాక్ కావాల్సిందే!

Watch Video: సెల్పీ వీడియోల కోసం యువత పడుతున్న పాట్లు అంతా ఇంతకాదు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న లక్ష్యంతో.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విగతజీవులుగా మారి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ తరహా ఘటనే తాజాగా సెర్బియా దేశంలో జరిగింది. 19 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ తీసుకున్న సాహాసోపేతమైన నిర్ణయం.. ఆమె ప్రాణాలను కబలించి వేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె చేసిన పనేంటి? ఎలా చనిపోయింది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పారా సైలింగ్ చేస్తుండగా..
19 ఏళ్ల టిజానా రాడోంజిక్ (Tijana Radonjić) సెర్బియాలో చాలా పాపులర్ అయిన సోషల్ మీడియా ఇఫ్లూయెన్సర్. వృత్తి రిత్యా మోడల్ అయిన ఆమె టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సెల్ఫీ వీడియో కోసం ఆమె తీసుకున్న నిర్ణయం టిజానా రాడోంజిక్ ప్రాణాలు తీసింది. 2025 జూన్ 2న మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో జరిగిన పారా సైలింగ్ ప్రమాదంలో టిజానా మరణించింది. బోటుకు తగిలించుకున్న క్లిప్ ద్వారా సముద్రంపై వేలాడుతున్న క్రమంలో ఆమె కిందపడి పోయి తుది శ్వాస విడించింది.

రక్షణ బెల్ట్ తీసేసిన టిజానా!
ప్రమాద వీడియోను గమనిస్తే పారాసైలింగ్ సమయంలో టిజానా వీడియో తీసుకుంటూ కనిపించింది. టిక్ టాక్ కోసం ఆమె వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే టిజానా విచిత్రంగా ప్రవర్తించింది. పారాసైలింగ్ కోసం తన శరీరానికి తగిలించిన హార్నెస్ (భద్రతా బెల్ట్) తీసేసింది. దీంతో పై నుంచి కింద ఉన్న సముద్రంలోకి పడి  ప్రాణాలు కోల్పోయింది. పానిక్ అటాక్ (ఆందోళన దాడి) కారణంగానే ఆమె అలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకుందా?
టిజానా వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఆత్మహత్య చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బలవంతంగా బెల్ట్ విప్పడాన్ని చూస్తే అందరికీ అదే అర్థమవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిని టిజానా కుటుంబం ఖండించింది. ఆమెకు మానసికంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది. పారా సైలింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే సెర్బియాలోని అడ్రియాటిక్ సముద్రంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!