Adi Srinivas (imagecredit:twitter)
తెలంగాణ

Adi Srinivas: బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా మీరు పొత్తు పెట్టుకునేది.. ఆది శ్రీనివాస్!

Adi Srinivas: బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని హరీష్ రావు చెబుతున్నాడని, పాపం హరీష్ రావు చాలా అమాయకంగా ఉన్నాడని, సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేదని అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, విలీన ప్రయత్నాలను స్వయంగా కేసీఆర్ కూతురే బయటపెట్టారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధాన్ని కవిత సాక్ష్యాలతో సహా బయటపెట్టిందని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయం సరైన సయమంలో ఇద్దరు ఒకటైపోతారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈటెల రాజేందర్ మధ్యవర్తిగా వ్యవహారం జరుగుతుందనే ప్రచారం ఉంది. హరీష్ రావు మాత్రం పొత్తులు లేవని బీఆర్ఎస్ క్యాడర్ మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నాడని, బీఆర్ఎస్, బీజేపీ చీకటి స్నేహం పైన మా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటి  నుంచి చెపుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరే లీడర్లు

పొత్తుల గురించి మాట్లాడటానికి హరీష్ రావు ఎవరు? హరీష్ రావుకు బీఆర్ఎస్ ఉన్న పాత్ర ఏమిటీ? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బీఆర్ఎస్ రజతోత్సవం తోనే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మాత్రమే లీడర్లని తేల్చారు. హరీష్ రావు ఫోటో కూడా రజతోత్సవ సభలో పెట్టలేదు. హరీష్ రావుకు ఏ హోదా ఉందని పొత్తుల గురించి మాట్లాడుతున్నాడని అన్నాడు. పార్టీ అధ్యక్షుడు ఫాం హౌస్ లో ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో జల్సా చేస్తున్నాడు. కేసీఆర్, కేటీఆర్ చెప్పకుండా హరీష్ రావు ఎందుకు పొత్తులపై ప్రకటనలు చేస్తున్నాడు? హరీష్ రావుకు దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత మాటల పైన ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించలేదు. దెయ్యాలు, కోవర్టుల గురించి నోరు మెదపడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిత పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆది శ్రీనివాస్ అన్నారు.

హరీష్ రావు దొంగ సవాల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మా ప్రభుత్వం పండుగలా చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహారించింది. కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదని అన్నారు. ఫామ్ హౌస్ లో నైనా అమరవీరులను స్మరించుకోవచ్చు కదా? అమరవీరులకు నివాళులు అర్పించడానికి మీకు చేతులు రాలేదా అని ఘాటుగా స్పందించారు. అధికారం ఉంటేనే మీకు తెలంగాణ, అమరవీరులు గుర్తుకు వస్తారా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున  కేసీఆర్ ఫామ్ హౌస్, కొడుకు అమెరికాలో, కూతురు ఆమె ఆఫీసులో కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని హరీష్ రావు మా ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. 21 వేల కోట్ల రుణమాఫీ చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు దొంగ సవాల్ చేస్తున్నాడు. ఒకే సారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించి మాట తప్పింది హరీష్ రావే అని గుర్తుచేశారు.

Also Read: Ponguleti srinivas: రెవెన్యూ వ్యవ‌స్ధలో మ‌రో ముంద‌డుగు.. ప్రజ‌ల వద్దకే అధికారులు!

కావాలనే హరీష్ రావు అబద్ధాలు

అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లో 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాంమని అన్నారు. గ్రామాల వారీగా లెక్కలు ఉన్నాయి. కావాలంటే హరీష్ రావుకు ఇస్తాం. గ్రామాల్లో రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్, నియోజకవర్గాల వారీగా జాబితా ఇచ్చాంమని, ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఈ లిస్ట్ ఉందని అన్నారు. కావాలనే హరీష్ రావు అబద్ధాలు చెపుతున్నాడు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. లక్ష రూపాయల రుణమాఫీ సరిగా మీరు కూడా మా ప్రభుత్వం గురించి మాట్లాడుతారా సిగ్గుండాలని అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. రైతు భరోసా సాయాన్ని 12 వేలకు పెంచాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేలు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, వడ్లు కొనుగోలు చేశాం సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం రైతులకు మీరేం చేశారని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి లక్ష్యం

రైతులకు ఎవరు ఏమీ చేశారో హరీష్ రావుతో బహిరంగ చర్చకు మేం సిద్ధమని, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. రైతును రారాజు చేయడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన మూడు రోజులకే కూలిపోతుందని అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేస్తారా? బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణతో దేశానికి రోల్ మోడల్ గా నిలిచామిని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మిగలదు. రాజన్న ఆలయంలో కోడెల మరణం పైన ప్రభుత్వం తక్షణమే స్పందించింది. అనారోగ్యంగా కారణంగా కొన్ని  కోడెలు చనిపోయాయి. అనారోగ్యంగా ఉన్న కోడెలు, పాలు మరవని కోడెలను భక్తులు ఆలయానికి ఇవ్వొద్దు అని అన్నారు. రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదు. భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Also Read: Raja Singh: రాజాసింగ్ పై చర్యలు.. జాతీయ పార్టీ నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు!

 

 

 

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ