MLC Kavitha: నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం మన నీళ్లు, వనరుల రక్షణ పై కవిత్వం రావాలన్నారు. కవులపై ఉన్న బాధ్యత పెద్దది.. సమాజాన్ని సరైన బాటలో నడిపేదే కవిత్వం అని స్పష్టం చేశారు. ఆబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కెరటాలు కవి సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంతో ఆమె పాల్గొని మాట్లాడారు. కవులు, సాహితీవేత్తలు పాలనలో లోపాలను ఎత్తిచూపాలన్నారు. తెలంగాణ గడ్డలోనే ధిక్కారం ఉంటుందని.. అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుందని గుర్తు చేశారు.
చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటేనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, వైభవం, విశిష్టత వందల ఏళ్లు నిలిచి ఉంటుందన్నారు. యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం వందల ఏళ్లు వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు కవులు ఈ సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేశారని తెలిపారు. కేసీఆర్ దిక్సూచీలా, దారిదీపంలా నిలబడి ఉద్యమ దిశానిర్దేశం చేశారని.. ఆయన సాగించిన పోరాటాలు, వందలాది మంది త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు జూన్ 2 అన్నారు.’
Also Read:Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!
రేపటి తెలంగాణ అభివృద్ధి, వికాసం కోసం సాహిత్య సృజన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వనరులను పరిరక్షించుకోవాలన్నా, నీళ్లు.. నిధులు హక్కులు కాపాడుకోవాలన్నా అందుకు కవులు, సాహితీవేత్తల సహకారం అవసరం అన్నారు. ఈ అంశాలపై తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమాలకు చేయూతనందించాలని కోరారు. తెలంగాణతో సంబంధం లేని రాజీవ్ గాంధీతో పేరుతో కాకుండా తెలంగాణ ఉద్యమకారుల పేరుతో యువ వికాసం పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేలనే కలకాలం నిలిచి ఉంటుందన్నారు. కంచనపల్లి గోవర్ధన రాజు రచించిన బలమూరి కొండలరాయుడు గేయ కావ్యాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అంతకు ముందు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగుర వేశారు. సుదీర్ఘ పోరాటం, వందలాది మంది బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అని నినదించని సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
Also Read: Kishan Reddy: అభివృద్ధి కాదు, అవినీతి పెరిగింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!