Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఊహించని దెబ్బ తగలింది. బెంగళూరులో ఆయనకు చెందిన ‘వన్8 కమ్యూన్ పబ్’ (One8 Commune Pub)కు మరోమారు కేసు నమోదు అయ్యింది. పబ్‌లో ధూమపానం చేసేందుకు ప్రత్యేకించి స్మోకింగ్ జోన్ లేనందున కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. COTPA చట్టం ప్రకారం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గతంలోనూ కేసులు నమోదు
బెంగళూరులోని ప్రముఖ ఎమ్‌జీ రోడ్ ఏరియాలో కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ ఉంది. 2024 జులైలోనూ ఈ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 1:30 గంటల వరకు తెరిచి ఉంచడంతో పాటు అధిక శబ్దంతో సంగీతం వాయించడం వల్ల స్థానికుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పబ్ నిర్వాహకులపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అదే ఏడాది డిసెంబర్ లో బెంగళూరు బృహత్ మహానగర పాలిక (BBMP) అధికారులు సైతం నోటీసులు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు అందజేశారు. తాజాగా స్మోకింగ్ జోన్ లేని కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం.. ఆసక్తికరంగా మారింది.
Also Read: Glenn Maxwell: సంచలన నిర్ణయం తీసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్.. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండర్
పబ్‌లో అవి ఫేమస్!
వన్ 8 కమ్యూన్ పబ్ కు కోహ్లీ యజమానిగా ఉన్నాడు. బెంగళూరు సహా ఢిల్లీ, ముంబయి, పుణె, కోల్ కత్తా వంటి మెట్రో నగరాల్లో ఈ పబ్స్ ను కోహ్లీ ఏర్పాటు చేశాడు. 2023 డిసెంబర్ బెంగళూరు శాఖను ప్రారంభించారు. లైవ్ మ్యూజిక్, రుచికరమైన వంటకాలకు వన్ 8 కమ్యూన్ పబ్ ఫేమస్ గా మారింది. ఈ పబ్ బ్రాండ్ కు గోహ్లీ యజమానికి ఉన్నప్పటికీ ఆయన స్వయంగా పర్యవేక్షించడం లేదు. ఆయన ఏర్పాటు చేసిన టీమ్ పబ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది.