Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా అందరికీ బిగ్ షాక్ ఇస్తూ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ20లపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తను తీసుకున్న ఈ నిర్ణయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో మాట్లాడినట్లు వెల్లడించాడు.
Also Read: IAS officer Alugu Varshini: వివాదాలకు కేరాఫ్‌గా ఐఏఎస్ అధికారిణి.. వర్షిణీపై ఎస్సీ కమిషన్ సీరియస్!
ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం, ఇది హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ లవర్స్ కూడా ఈ వార్త వినగానే షాక్ అయ్యారు. 2026 లో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి సారిస్తాడని తెలిపాడు. అలాగే, ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి టీ20 లీగ్‌లలో కూడా ఆడతాననని తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
మాక్స్‌వెల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణాలు ఇవే..
మాక్స్‌వెల్ ఇంత సడెన్ గా ఇలాంట నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం.. అతను వన్డే ఫార్మాట్‌లో శారీరక ఒత్తిడికి గురవుతున్నడు. అలాగే, 2022లో కాలు విరిగిన విషయం మనకి తెలిసిందే.