Kavitha Letter
Politics, తెలంగాణ

Kavitha: నిన్న కేసీఆర్‌కు, ఇవాళ సీఎంకు కవిత లేఖ.. ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్!

Kavitha: తెలంగాణలో ఇప్పుడు లేఖల పర్వం నడుస్తున్నది. మొన్న ఆ మధ్య బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) ఎమ్మెల్సీ కవిత (Kavitha) రాసిన ఐదు పేజీల లేఖ ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతలా అంటే.. లేఖ నుంచి కొత్త పార్టీ వరకూ వ్యవహారాలు వెళ్లాయి. ఈ లేఖ వ్యవహారం సద్దుమణగకముందే సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓరి బాబోయ్.. కవిత మళ్లీ ఏం బాంబ్ పేల్చింది? అంటూ జనాలు నెట్టింట్లో ఆ లేఖ కోసం తెగ వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే ‘కాంగ్రెస్‌తో కవిత రాయబారం’, ‘ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి..’, ‘కవితకు మంత్రి పదవి పక్కా’ లాంటి కథనాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. దీంతో రేవంత్‌కు రాసిన లేఖలో ఏముందని జనాలు చదువుతున్నారు. అయితే ఇది రాజకీయాలకు సంబంధించినది కాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.

Read Also- Kavitha And Sharmila: ఓరి బాబోయ్.. కవిత, వైఎస్ షర్మిల ఇలా సింక్ అవుతున్నారేంటి?

ఇదీ అసలు సంగతి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్‌ చేశారు. వార్డుల వారీగా మళ్లీ టెండర్లు నిర్వహించాలని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) ఆదివారం బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజిన్లలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్‌కు సంబంధించిన పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం కలుగుతోందని తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలనే నిబంధనలు పెట్టారని ఆ స్పెసిఫికేషన్స్ ఉన్న వాహనాలను విక్రయించే డీలర్లు హైదరాబాద్‌లో ఇద్దరే ఉన్నారని వివరించారు. టెండర్లలో పాల్గొన్న స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేసేందుకు సమ్మతి ఇవ్వకపోవడంతో వారు కర్నాటక డీలర్ల నుంచి ఎంవోయూ తీసుకొని టెండర్లలో పాల్గొన్నారని తెలిపారు. ఆ కాంట్రాక్టర్లు ఎంవోయూకు సంబంధించిన ఫిజికల్ కాపీలు సమర్పించడానికి జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు తగినంత సమయం ఇవ్వడం లేదని, మెడపైకి కత్తి పెట్టి కొన్ని గంటల వ్యవధిలోనే కాపీలు సమర్పించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఫిజికల్‌ కాపీలు సమర్పించలేదనే సాకు చూపించి స్థానిక కాంట్రాక్టర్లను టెండర్లలో డిస్ క్వాలిఫై చేసి తాము ముందే ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కొందరు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారంలో ఉన్నదని తెలిపారు.

Kavitha Jagruthi

Read Also- Opal Suchata: ప్రామిస్ ప్రభాస్ సినిమా చూస్తా.. మిస్ వరల్డ్ చెప్పిన మూవీ ఏంటో తెలుసా?

అన్యాయం జరగకుండా..
గతంలో ఈ పనుల కోసం వినియోగించిన వాహనాల ద్వారా రెండు, మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్పెసిఫికేషన్స్ ఒక విదేశీ కంపెనీకి చెందిన వాహనాలకు మాత్రమే ఉన్నదన్నారు. ఆ వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని మీడియాలో కథనాలు వచ్చాయని, కేవలం ఆ కారణంతోనే ఒక ఏడాదికి గతంలో అయ్యే వ్యయం రూ.5.40 కోట్లు అయ్యే వ్యయం రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగి రూ.11.25 కోట్లకు చేరిందన్నారు. ఏటా రూ.5.85 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి చూస్తున్నందున జీహెచ్ఎంసీ టెండర్లలో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేసి గతంలో మాదిరిగా వార్డుల వారీగా మళ్లీ టెండర్లు పిలిస్తే 150 మంది కాంట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుందన్నారు. దీనికి విరుద్ధంగా జీహెచ్ఎంసీ జోన్‌ల వారీగా టెండర్లు పిలవడంతో 9 టెండర్లు మాత్రమే దాఖలు చేసే అవకాశం లభించిందని, ఆ టెండర్లను కూడా రెండు సంస్థలకే కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో టెండర్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగానికి ప్రయత్నిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

Read Also- Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?