Minister Ponguleti(imagecredit:twitter)
తెలంగాణ

Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన స్లాట్ బుకింగ్‌.. మంత్రి వెల్లడి!

Minister Ponguleti: రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా రెండు విడ‌త‌ల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లుచేయ‌గా, నేటి నుంచి మిగిలిన 97 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లోనూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఆదివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ అధికారుల‌తో మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్తుల క్రయ ,విక్రయ‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయ్యేలా పార‌ద‌ర్శకంగా, అవినీతి ర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించేందుకు చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానం వ‌ల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.

94 శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు. ప్రజ‌ల ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, మ‌నోభీష్టం మేర‌కే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమ‌లుచేస్తుంద‌న్నారు.అంతిమంగా ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

స్లాట్ బుకింగ్ ఎఐతో అనుసంధానం

ఇక అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్-ఎఐ) అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ – మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నూత‌న ప్రక్రియ వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి క‌లిగే సందేహాలు నివృత్తి అవుతాయన్నారు. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివ‌రాలు, స‌మ‌యం అందుబాటు వంటి స‌మాచారం ల‌భిస్తుంద‌న్నారు.

Also Read: Botsa Satyanarayana: మహానాడు పెద్ద డ్రామా.. సీఎం ప్రసంగమంతా సొల్లే.. బొత్స ఫైర్

గిప్ట్ డీడ్‌, సేల్ డీడ్ పై రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు మార్కెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అన్ని అంశాల‌పై ఈ ఎఐ చాట్‌బాట్ – మేధ ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చన్నారు. అక్రమాల‌కు చెక్ పెట్టేలా లే అవుట్‌ల‌లో డబుల్ రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌కుండా, రిజిస్ట్రేష‌న్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివ‌రాలు కూడా లభ్యమవుతాయన్నారు. ఇటు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో అటు బిల్డర్ లేదా డెవలపర్ ద‌గ్గర వివ‌రాలు ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్ ను త్వరలో తీసుకువస్తామని లిపారు. ఈ మ్యాడుల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయి.

రోజుకు 48 స్లాట్‌లు

స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌లో ప‌ని భారం అధికంగా ఉన్న ప‌ఠాన్‌చెరువు, యాద‌గిరి గుట్ట, గండిపేట‌, ఇబ్రహీం ప‌ట్నం, సూర్యాపేట‌, జ‌డ్చర్ల, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అద‌న‌పు స‌బ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియ‌మించ‌డం జరిగిందన్నారు.ఉద‌యం 10.30 గంట‌ల నుంచి లంచ్ స‌మ‌యాన్ని మిన‌హాయించి సాయింత్రం 5 గంట‌ల వ‌ర‌కూ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చున‌ని ప్రతి కార్యాల‌యంలో రోజుకు 48 స్లాట్‌లు బుక్ అవుతాయ‌న్నారు.

స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవ‌స‌ర సంద‌ర్భాల‌లో సాయంత్రం 5 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు ఐదు వాకిన్ రిజిస్ట్రేష‌న్లకు అనుమ‌తి ఇవ్వడం జరిగిందన్నారు.స్లాట్ బుకింగ్‌తోపాటు రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా ఆధార్‌-ఈ సంతకం ప్రవేశ‌పెడుతున్నామ‌ని ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ప్రయోగాత్మక అమలు చేస్తున్నామని ,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు.

Also Read: Damodar Rajanarsimha: స్టైఫండ్ సమస్య సృష్టిస్తున్న.. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి!

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?