Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్(భయ్యా సందీప్) (Bayya Sunny Yadav) పేరు సోషల్ మీడియాలో మారు మోగుతుంది. బైక్‌పై ఇతర దేశాలు తిరుగుతూ చాలా పాపులర్ అయ్యాడు. నెలలు తరబడి దేశాన్ని వదిలి ఇతర దేశాల్లోనే ఉంటూ.. సోషల్ మీడియా (Social Media) లో ఫాలోవర్స్‌ను పెంచుకుని యూట్యూబర్‌గా మారాడు. అయితే, కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్‌లో ఈ వ్లాగర్ పేరు బాగా వినపడింది. అంతక ముందే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నూతనకల్ పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కాస్త స్ట్రాంగ్‌గానే చెబుతూ, పోలీసులకు వివరించారు. దీంతో, నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో భయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Rangareddy Medchal: ఎఫ్‌టీఎల్ ఎందాక?.. ఈ జిల్లాల్లోనే 60శాతానికి పైగా చెరువుల్లో ఆక్రమణలు!
వీడియో తీసి పెట్టడమే సన్నీ యాదవ్ చేసిన తప్పా?
ఈ క్రమంలోనే సన్నీ యాదవ్ బైక్ పై పాకిస్దాన్ కు వెళ్లాడు. అక్కడ ప్రదేశాలలో తిరుగుతూ వీడియోలు చేసాడు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పర్యటన పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎన్ ఐఏ కి అనుమానం రావడంతో వెంటనే, అతన్ని సన్నీని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసిన సమాచారం.
Also Read: Rangareddy Medchal: ఎఫ్‌టీఎల్ ఎందాక?.. ఈ జిల్లాల్లోనే 60శాతానికి పైగా చెరువుల్లో ఆక్రమణలు!
జకీర్ తో సన్నీ యాదవ్ ఎందుకు మాట్లాడారు?
పాకిస్థాన్ లో సన్నీ యాదవ్ తిరిగిన ప్రదేశాల పై NIA విచారణ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, తాజాగా సన్నీ కి సంబందించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ పై ఆరా తీస్తున్నారు. అతను హిందూమతం గురించి ప్రశ్నలు వేయగా.. తమ మతమే గొప్పదని జకీర్ నాయక్ చెప్పారు. అసలు అక్కడికి వెళ్లి జకీర్ తో సన్నీ యాదవ్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అతనితో ఉన్న సంబంధాలపై NIA ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ లో భారత దేశానికి చెందిన వ్యక్తికి మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? అసలు దీని వెనుక ఏం జరిగి ఉంటుందనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.