AICC': కమిటీల్లో ఆ మంత్రులకు.. చోటేది?
AICC(Image credit: swetcha reporter)
Political News

AICC: కమిటీల్లో ఆ మంత్రులకు.. చోటేది?

AICC: ఏఐసీసీ ప్రకటించిన ఐదు కమిటీల్లో నలుగురు సీనియర్ మంత్రులకు స్థానం లభించలేదు. రాష్ట్రంలో పొలిటికల్ అఫైర్స్ , అడ్వైజరీ, డిలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్, డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ లను ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కమిటీల్లో సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలకు స్థానం లభించలేదు. సీఎం నుంచి కార్పొరేషన్ చైర్మన్లలో కొందరికి ఈ కమిటీల్లో అవకాశం కల్పించినా, ఈ నలుగురు మంత్రులకు ఎందుకు కమిటీల్లో నియమించలేదనేది చర్చంశనీయంగా మారింది. చివరకు ప్రభుత్వంలో ఎలాంటి కీలక పోస్టుల్లో లేనోళ్లను కూడా ఈ కమిటీల్లో గుర్తింపు ఇవ్వడం గమనార్హం. ఇది పొలిటికల్ వర్గాల్లో బిగ్ డిస్కషన్ గా మారింది. ఈ మంత్రులకు పక్కకు పెట్టారా? లేదా ఇతర కీలక పదవులు ఏవైన ఇస్తారా? అనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది.

పొలిటికల్ ఆఫైర్స్ లో 8 మంది మంత్రులు...
ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎంతో కలిపి ఏకంగా 8 మంది మంత్రులు ఉన్నారు. పీసీసీ చీఫ్​, ఏఐసీసీ ఇన్ చార్జ్ లకు సైతం స్థానం లభించింది. కానీ ఈ నలుగురి మంత్రులకు చోటు లభించకపోవడం అందరి నోట డిస్కషన్ మొదలైంది. అయితే ఈ కమిటీ కూర్పులో 22 మంది నేతలు ఉండగా, ఎక్స్ అఫీషియో హోదాలో ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక స్పెషల్ ఇన్వైటీస్ కోటాలో క్యాబినెట్ మంత్రులంటూ కోట్ చేశారు. కానీ కమిటీలో మాత్రం నలుగురి మంత్రులకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కీలక పోస్టులో లేని వంశీచంద్ రెడ్డికి మాత్రం పొలిటికల్ ఆఫైర్స్ కమిటీలో ఛాన్స్ ఇస్తూనే…డీలిమిటేషన్ కమిటీకి చైర్మన్ గా ప్రకటించారు.

Also Read: Harish Rao on TPCC: దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు.. పీసీసీ ఛీఫ్‌పై హరీష్ రావు ఫైర్!

ఏం జరుగుతుందో..?
కీలక కమిటీల్లో తమ పేర్లు లేవని ఆయా మంత్రులు కూడా ఇంటర్నల్ గా ఫీలయ్యారని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇక తమ నేతలకు పార్టీ కమిటీల్లో ప్రయారిటీ ఇవ్వరా? అంటూ ఇప్పటికే ఫాలోవర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ, జిల్లా కమిటీ అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇది తమ నేతలను అవమానించడమే అంటూ ఆయా నేతల ఫాలోవర్స్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తన దైన శైలీలో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిగతా ముగ్గురు మంత్రులు కూడా ఆయా శాఖలను నిత్యం రివ్యూ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.ఇందులో మంత్రి కొండా సురేఖ మాత్రం కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ అయ్యారు. సినీనటి సమాంత విషయంతో పాటు అందాల భామల పోటీలో ఇంగ్లీష్ స్పీచ్ పై సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

మోస్ట్ సీనియర్లకు రాజకీయ పదవులు…?
అడ్వైజరీ కమిటీలో మోస్ట్ సీనియర్లకు అవకాశం కల్పించారు. వి హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితర నేతలకు ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం వీరికి పార్టీలో ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. దీంతో నే పార్టీలో అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పిస్తూ కేసీ నిర్ణయం తీసుకున్నారని పీసీసీ నేతలు చెప్తున్నారు. ఇందులో చాలా మంది పార్టీ పదవిపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. తమకు ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాల్సిందిగా హైకమాండ్ పై ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం.

Also Read: L&T on Medigadda Barrage: అంతుపట్టని ఎల్ అండ్ టీ వైఖరి.. బీఆర్ఎస్‌ పాలనలో ఒకలా.. కాంగ్రెస్‌ హయాంలో మరోలా!

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!