Actress Kalpika: బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులకు, నటి కల్పికకు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదంలో తనపై నటి కల్పికపై పబ్ నిర్వాహకులు దాడికి తెగబడ్డారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్, గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద వున్నటు వంటి ప్రిజం పబ్‌లో టాలీవుడ్ నటి కల్పికకు తీవ్ర అవమానం జరిగింది. అంతేకాదు, ఆమెపై దాడి కూడా చేయడంతో ఈ విషయాన్ని ఆమె సీరియస్‌గా తీసుకుంది. ఇంతకు ముందు ఇదే పబ్ విషయంలో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా బేబీలాన్ పబ్‌లో జరిగిన గొడవ మరవకముందే ఇప్పుడిలా మరో పబ్‌పై ఆరోపణలు రావడంతో అసలు హైదరాబాద్ పబ్‌లలో ఏం జరుగుతుందనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా నటిపైనే దాడికి పూనుకోవడంతో.. ప్రస్తుతం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read- Natti Kumar: నారాయణమూర్తి నీ బుద్ధి ఏమైంది?.. నట్టి కుమార్ ఫైర్
అయితే ఈ గొడవ అంతా బర్త్‌డే కేక్ విషయంలో జరిగినట్లుగా తెలుస్తుంది. కల్పిక, తన స్నేహితులతో కలిసి ఓ బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ప్రిజం పబ్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బర్త్‌డే కేక్‌కు సంబంధించిన విషయంపై కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త తీవ్రంగా మారడంతో, పబ్ నిర్వాహకులు కల్పికపై బూతులతో రెచ్చిపోవడమే కాకుండా, ఆమెపై దాడికి దిగినట్లుగా కల్పిక ఆరోపిస్తుంది. ఆమె ఆరోపణల ప్రకారం, పబ్ సిబ్బంది ఆమెను కావాలని ‘డ్రగ్గిస్ట్’ అంటూ అవమానించినట్లుగా తెలుస్తోంది. అలా మాట్లాడటమే కాకుండా, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా కల్పిక చెబుతోంది. నిర్వాహకులు అలా ప్రవర్తిస్తున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు కూడా ఆమెకు సహకరించలేదట.
గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి..
హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ
తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక
పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయని హీరోయిన్, పబ్ యాజమాన్యం pic.twitter.com/7553Z83LxT
— BIG TV Breaking News (@bigtvtelugu) May 31, 2025
అనంతరం ఆమె స్థానిక పోలీసులను సంప్రదించి, విషయం అంతా చెప్పి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. అసలు అక్కడ ఏం జరిగింది? పబ్ సిబ్బంది, నిర్వాహకులపై కల్పిక చేస్తున్న ఆరోపణలలో నిజమేంటి? అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించడంతో పాటు, ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసే పనిలో ఉన్నారు పోలీసులు.
Also Read- Sekhar Kammula: మెగాస్టార్ చిరంజీవితో.. ఎమోషనల్ మెసేజ్ వైరల్!
మరో వైపు కల్పిక ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్‌డే పార్టీకి వచ్చిన ఒక నటిపైనే ఇలా పబ్ నిర్వాహకులు ప్రవర్తించారంటే, ఇక సామాన్యులపై వారి తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, ఈ ఘటన తనను ఎంతగానో మానసిక వేదనకు గురి చేసిందని, ఇలాంటి సంఘటనలు ఎవరికీ జరగకూడదని ఆందోళన వ్యక్తం చేసింది. మరో వైపు, హైదరాబాద్ పబ్‌లలో ఏం జరుగుతుందో ఒక్కసారి ప్రభుత్వం దృష్టి పెట్టాలని, అక్కడి భద్రతా ప్రమాణాలతో పాటు, అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చిందనేలా ఈ ఘటన అనంతరం నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు