Harish Rao on TPCC: సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారుసూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా శనివారం పేర్కొన్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారన్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవు అన్నారు.
పెళ్ళి లోనో, చావు లోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదని స్పష్టం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారు.
Also Read: Damodar Rajanarsimha: స్టైఫండ్ సమస్య సృష్టిస్తున్న.. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి!
రాష్ట్రంలో కరెంటు కోతలు
రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని మండిపడ్డారు. పేదలకు వైద్యం అందకుండా పోతున్నది, సీఎం రేవంత్ రెడ్డి.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి అని సూచించారు.
Also Read: Swetcha Effect: నకిలీ విత్తనాల దందాపై.. స్పందించిన ప్రభుత్వం!