Indraaniel in Shambhala
ఎంటర్‌టైన్మెంట్

Shambhala: ‘శంబాల’.. మరో పవర్ ఫుల్ పాత్రని రివీల్ చేశారు

Shambhala: యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar) నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambala: A Mystical World). షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోన్న తెలిసిందే. రీసెంట్‌గానే విడుదల చేసిన ‘శంబాల’ మేకింగ్ వీడియో అయితే అమాంతం సినిమాపై అంచనాలను పెంచేసింది. పోస్టర్స్, మేకింగ్ వీడియోతోనే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో చర్చ నడుస్తుందంటే.. సినిమా ఏ రేంజ్‌లో రెడీ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ మూవీ నుంచి మరో పవర్ ఫుల్ పాత్రని మేకర్స్ రివీల్ చేశారు.

Also Read- R Narayana Murthy: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. పీపుల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

టాలెంటెడ్ యాక్టర్ ఇంద్రనీల్ (Indraaniel) పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని గమనిస్తే భయంకరమైన, క్రూరమైన రీతిలో ఆయన కనిపిస్తున్నారు. అతని వెనుక ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే.. అక్కడేదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది. సినిమాలో మెయిన్ విలన్‌గా ఇంద్రనీల్ కనిపిస్తున్నారనే విషయాన్ని ఈ పోస్టర్ క్లారిటీ ఇస్తుంది. మరి అతను మెయిన్ విలనా? కాదా? అనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. కానీ పోస్టర్, అందులో అతని రూపం చూస్తుంటే మాత్రం అతనే మెయిన్ విలన్ అని అనిపిస్తోంది. మొత్తంగా అయితే ఈ పోస్టర్‌ సినిమాపై మరింతగా క్యూరియాసిటీని పెంచుతోంది.

Also Read- Hari Hara Veera Mallu: సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారా?

ఈ ‘శంబాల’ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనుండగా.. సూర్య 45 (Suriya45)వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన దర్శకుడు యుగంధర్ ముని.. హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ విషయం ఇటీవల వచ్చిన మేకింగ్ వీడియో స్పష్టతనిచ్చింది. ఈ మూవీలో విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉంటాయని మరోసారి మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీతో సహా.. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌ని ఇస్తామని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఇంద్రనీల్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..