Congress on Kavitha: కవిత ఎపిసోడ్‌ను కాంగ్రెస్ మానిటరింగ్ చేస్తోంది. స్వయంగా కేసీఆర్ (KCR) కన్న కూతురు (కవిత) ద్వారా బీఆర్‌ఎస్‌లో చీలికలు మొదలయ్యాయని భావిస్తున్న కాంగ్రెస్, ఆ పంచాయితీ ఎక్కడికి వరకు వెళ్తుందనే దానిపై పార్టీ అధ్యయనం చేస్తోంది. కవిత (Kalvakuntla Kavitha) వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ (BRS)ను ఏ మేరకు డ్యామేజ్ చేస్తాయోనని పరిశీలిస్తోంది. కవిత ఎపిసోడ్‌పై పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేయాలని స్పోక్స్ పర్సన్‌లకు పార్టీ ఆదేశాలు కూడా ఇచ్చింది. గత వారం రోజుల నుంచి డైలీ ఎపిసోడ్ తరహాలో కొనసాగుతున్న కవిత ఇష్యూ (Kavitha Issue), బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందా, లేదా అనే అంశాన్ని స్పోక్స్ పర్సన్‌లు ఎప్పటికప్పుడు పార్టీకి తెలియజేస్తున్నారు. దీంతో ఆయా నేతలు కవిత ఏం మాట్లాడినా, దాని పర్యావసనాలు, ప్రభావాలను గుర్తించి పార్టీకి అనాలసిస్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటికే పార్టీ పై క్యాడర్ మొత్తం అసంతృప్తితో ఉన్నట్లు లేఖ ద్వారా వివరించిన కవిత, పదేళ్లలో జరిగిన తప్పిదాలు, నిర్లక్ష్యం, అవినీతి అంశాలపై లీకులు ఇచ్చే ఛాన్స్ ఉన్నదని ఆమె సన్నిహితులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కవితకు ప్రాధాన్యత లేదని, దీంతో ఆ పార్టీలో జరిగేవన్నీ స్పష్టంగా బహిర్గతం చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తున్నది. దీంతో కవిత ఎప్పుడు ఏం రివీల్ చేస్తారని కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ‘వాళ్ల ఇంట్లో పంచాయితీకి మాకేం సంబంధం. ఆ పార్టీలో పైసలు, పదవుల లొల్లి మొదలైంది. బీఆర్‌ఎస్ తప్పిదాలు, నిర్లక్ష్యం, అవినీతిని కవిత ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని మేము కూడా ఎదురుచూస్తున్నాం’ అని ఓ కీలక మంత్రి కూడా వెల్లడించారు.
విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటి వరకు స్పందించలేదు. కీలక మంత్రుల కూడా ఆ అంశంపై సీరియస్‌గా మాట్లాడటం లేదు. కవిత వ్యాఖ్యలు, లెటర్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఒకరిద్దరు మంత్రులు ఆ ఎపిసోడ్‌ను దాట వేస్తుండగా, సీఎం మాత్రం పొలిటికల్‌గా ఏం జరుగుతుంది, ఆమె విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయని పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను సొంత మనుషులే దెబ్బ తీస్తున్నప్పుడు అధికార పక్షం క్షుణ్నంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ అండ్ పార్టీని కవిత కొంత వరకు డ్యామేజ్ చేయగలిగితే, మిగతా పార్ట్ కాంగ్రెస్ చూసుకుంటుందనే భ్రమలో పీసీసీ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్‌లు, ఇతర నాయకులు కవిత ఎపిసోడ్‌ను రెచ్చగొడుతున్నారు. అటు బీజేపీ కూడా ఈ అంశం లైవ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇక కవిత అలకపై ఏఐసీసీ కూడా గమనిస్తున్నది. రెండు రోజుల క్రితం పార్లమెంట్‌ల వారీగా ఎమ్మెల్యేలతో జరుగుతున్న మీటింగ్‌లో కవిత లేఖ, అసంతృప్తిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ను డ్యామేజ్ చేసేందుకు మరో అస్త్రం లభించిందని, ఎమ్మెల్యేలంతా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆమె సూచించారు.
Also Read: L&T on Medigadda Barrage: అంతుపట్టని ఎల్ అండ్ టీ వైఖరి.. బీఆర్ఎస్ పాలనలో ఒకలా.. కాంగ్రెస్ హయాంలో మరోలా!
ఎంక్వయిరీ మంత్.. కేడర్ స్ట్రెంత్
జూన్ నెలలో బీఆర్ఎస్ అగ్ర లీడర్ల వరుస విచారణలు జరగనున్నాయి. అటు కాళేశ్వరం (Kaleshwaram) లో కేసీఆర్ (KCR), హరీశ్ (Harish Rao), ఇటు ఫార్ములా ఈ రేస్ (Formula E – Race) లో కేటీఆర్‌లపై ఎంక్వైయిరీలు నిర్వహించనున్నారు. అయితే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కవిత స్వరం పెంచడంతో కాంగ్రెస్ పార్టీ స్తబ్ధుగా పరిశీలిస్తుంది. మూడు నాలుగు రోజుల తర్వాత కవిత అంశాన్ని కూడా అస్త్రంగా ఎక్కు పెట్టి, బీఆర్‌ఎస్‌ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. ముఖ్య నాయకులందరినీ ఎంక్వైయిరీల హడావుడిలో ఉండి, క్షేత్రస్థాయిలోని క్యాడర్‌ను క్వీన్ స్లీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ పార్టీలో ఉంటే మనుగడ ఉండదనే విషయాన్ని వివరిస్తూ జాయినింగ్స్‌ను ప్రోత్సహించే ఛాన్స్ ఉన్నట్లు ఓ కీలక నేత చెప్పారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కవిత ఎపిసోడ్ బీఆర్‌ఎస్‌కు మరింత డ్యామేజ్ చేసేలా తయారైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఈ అంశాలన్నీ జాయినింగ్స్‌కు మెరుగ్గా ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు.