Indiramma Lands: త్వరలో పేదలకు ఇందిరమ్మ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వ సుముఖంగా ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ…ఇందిరమ్మ హయంలో తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారన్నారు. ఆ తర్వాత పేదలను మోసం చేసి పెత్తందారులు, భూ స్వాములు ఆ భూములను గుంజుకున్నట్లు మంత్రి వివరించారు. గత పదేళ్లలో ఈ విధానం ఎక్కువగా జరిగిందన్నారు. అందుకే అసైన్డ్ భూములను ఎంక్వైయిరీ చేసి పేదలవా? కావా? అనేది తేల్చుతామన్నారు.
పేదల నుంచి పేదలకు భూమి ట్రాన్స్ ఫర్ అయితే ఏం కాదని, కానీ భూ స్వాములు, కార్పొరేట్ వ్యవస్థలు, శక్తులు, సంస్థలు, భూ బకారసులకు అసైన్డ్ భూములు ఉన్నాయని తేలితే, వెంటనే సర్కార్ స్వాధీనం చేసుకోనున్నదన్నారు. దాన్ని మిగతా పేద కుటుంబాలకు అందజేస్తామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోక, ఇప్పటికే 2.10 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. దీనికి అదనంగా చెంచులు, ఉప కులాలకు మరో 9200 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే అర్హుల లిస్టు ఇన్ చార్జీ మంత్రులకు చేరిందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టు ను కూడా కన్సిడర్ చేశామన్నారు. కేటీఆర్ మాత్రం ఎలాంటి లిస్టు ఇవ్వలేదన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు స్కీమ్ లు అందజేస్తామన్నారు. ఇక ఫైలట్ ప్రాజెక్టులో 42 వేలు ఇళ్లు టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 24 వేలు ఇళ్లకు పేమెంట్లు ఇచ్చామన్నారు. వీటిలో కొన్ని 15–20 రోజుల్లోనే గృహ ప్రవేశాలు చేయబోతున్నామన్నారు.
Also Read: Police Complaint: ‘పోలీస్ కంప్లెయింట్’.. రాకింగ్ లుక్‌లో వరలక్ష్మి శరత్ కుమార్..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక, ఇటుక ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. ఏడాది కిందటి ధరలుకే పంపిణీ చేయాలని వ్యాపారాలను ప్రభుత్వం కోరిందన్నారు. ఇక అర్బన్ ఏరియాల్లో గతంలో లాగా దూర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించబోమని మంత్రి పొంగులేటి తెలిపారు. జీ ప్లస్ 3, జీ ప్లస్ 4 లో క్లోజ్ చేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 16 స్లమ్స్ ను గుర్తించామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వంటి సిటీల్లోనూ ఈ ఫాలసీని అమలు చేస్తామన్నారు. గతంలో అర్బన్ ఏరియాల నుంచి 25 నుంచి 30 కి.మీ దూరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని, దీంతో సిటీలో ఉపాధి పొందే వాళ్లకు నష్టం జరిగిందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ. 5 లక్షల ఇళ్లతో పేదల చిరకల స్వప్నం తీరబోతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో దాదాపు 90 శాతం గ్రామాల్లో పేదలకు ఇళ్లు అందే అవకాశం ఉన్నదన్నారు.
ఇక భూ భూరతి ని నాలుగు మండలాల్లో ఫైలట్ మోడ్ లో అమలు చేసి, సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూ భారతి ద్వారా సాధాభైనమా భూములు కాకుండా మిగతవన్నీ క్లియర్ చేస్తామన్నారు. 95 శాతం దరఖాస్తు దారులకు సమస్య పరిష్కరించబడుతుందన్నారు. ధరణిలో 9.26 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో కొన్ని సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయన్నారు. సాధాభైనామాల్లో కొన్ని ఫేక్ ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల గెట్లు తెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నంబరు, రికార్డు, భూముల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఎంక్వైయిరీ చేసి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
Also Read: Drugs Seized: డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్.. 3.05కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్!
ఇందు కోసం సర్వేయర్లు పనిచేస్తారన్నారు. ఆరు వేల సర్వేయర్లను తీసుకోబోతున్నామన్నారు. లైసెన్స్ డ్ సర్వేయర్లకు ఇప్పటికే ట్రైనింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. గ్రామాల్లో జీపీవో లు కూడా రాబోతున్నారన్నారు. ఇక ఏఐ టెక్నాలజీ వినియోగించి రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను చూపుతున్నామన్నారు. స్లాట్ విధానం వలన కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. భూములపై ఫోరెన్సిక్ అడిట్ కూడా నిర్వహించబోతున్నామన్నారు. దీని వలన కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి కావడంతో పాటు వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందన్నారు. అవినీతి చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ఎందుకు కాదనేదానిపై ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చేలా క్లాజ్ పొందుపరిచామన్నారు.
ఢిల్లీలో బీజేపీ,బీఆర్ఎస్‌కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని వెల్లడించారు. కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని కొట్టిపారేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటి కాదు చాలా తప్పులు చేశారని… అన్నిటికి శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ దగ్గర దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారని.. ఆ దెయ్యాలు ఎవరో కవితనే చెప్పాలని అన్నారు. దేవుడు, దెయ్యాలు అంటున్న కవిత నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. కవిత నోరు విప్పాలని.. ఆమె ఏం చెబుతుందో వినాలని తాము కూడా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కి బీజేపీతో బంధం ఉందని కవిత స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
Also Read: Fake Cotton Seeds: 560 కేజీల నకిలీ విత్తనాలు.. రేటు ఎంతో తెలుసా?
బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.మాజీమంత్రి కేటీఆర్‌కు ఈడీ అంటే ఉత్సాహం ఎక్కువగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈడీ అధికారులు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని… వారు తన ఇంటికి ఎందుకు రావట్లేదో.. కేటీఆర్ అడిగితే బాగుంటుందని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయని, కానీ అర్ధరాత్రయినా రాహుల్‌గాంధీని కలిసే చనువు రేవంత్‌రెడ్డికి ఉన్నదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎవరిని పిలవాలో తమ ప్రభుత్వం నిర్ణయించదని నొక్కి చెప్పారు. ప్రభుత్వం చేతిలోనే పవర్స్ ఉంటే కేసీఆర్ ను తొలి ముద్దాయిగా కూర్చోపెట్టి ప్రశ్నించే వాళ్లమన్నారు. కాళేశ్వరంలో ఎల్ అండ్ టీ అసలైన ముద్దాయి అని పొంగులేటి చెప్పారు.కేసీఆర్, కేటీఆర్ లు తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారని, దాన్ని డైవర్ట్ చేసేందుకు అబద్దాలు ఆడుతున్నారని వివరించారు.
Also Read: MLA Veerlapalli Shankar: ఇదేమి డిప్యుటేషన్ల దందా.. వైద్య శాఖ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం!