Fake Cotton Seeds9image credit; swetcha reporter)
తెలంగాణ

Fake Cotton Seeds: 560 కేజీల నకిలీ విత్తనాలు.. రేటు ఎంతో తెలుసా?

Fake Cotton Seeds: కుటీర పరిశ్రమలాగా నకిలీ ప్రత్తి విత్తనాలు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టుకునీ అందుకు సంబంధించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలని, తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయాలు జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.

Also Read: Minister Komatireddy: బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ముందే చెప్పా.. మంత్రి కోమటిరెడ్డి!

కేసు వివరాలు 

తేదీ 28.05.2025 న ఉదయం ఏన్కూర్ పోలీస్, వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలలో భాగంగా ఏనుకూరు గ్రామానికి చెందిన గాజుల నరసింహారావు కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నాడని సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా అతని వద్ద 450 గ్రాములు బరువు గల అడ్వాన్స్ 555 పేర్లతో ఉమ్మడి పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎస్సై కల్లూరు ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి విచారణ చేశామన్నారు. ఈ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైలవరం మండలానికి చెందిన చంద్రుగూడెం గ్రామానికి చెందిన శాలివాహన వద్ద నుండి కిలో 450 గ్రాముల ప్యాకెట్లను రూ.400 కొనుక్కొచ్చి ఇక్కడ రూ.1,200 అమ్ముతున్నాడని విచారణలో వెలుగులోనికి వచ్చిందన్నారు.

ఇంటి వద్ద కుటీర పరిశ్రమలా నకిలీ పత్తి విత్తనాల తయారీ

ఈ విషయంపై సిపి ఖమ్మం ఆదేశం ప్రకారం శ్రీమతి డి హరిత ఎస్సై కల్లూరు ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి మైలవరం మండలం చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన చంద్రు గూడెం ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. అతను కర్ణాటక నుండి ప్రతి విత్తనాలు, వాటిని ట్యాగ్ చేయడానికి ప్రింటెడ్ అడ్వాన్స్ త్రిబుల్ ఫై నెంబర్ గల కవర్తో ఉన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చి పత్తి విత్తనాలను రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి పత్తి విత్తనాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేసి గాజుల నరసింహారావు మరి కొంతమంది ఏజెంట్లు ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని అలాగే కలుపమందు వలన ఇబ్బంది ఉండదని నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్ రూ.1,200 రైతులకు అమ్ముతున్నాడని తెలిసిందన్నారు.

Also Read: Meenakshi Natrajan: మీనాక్షి మార్క్ మొదలు.. ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్!

శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం

అతని ఇంటి వద్ద నుండి ఒక క్వింటా రైజోబెల్ మిశ్రమం కలిపి పెట్టి ప్యాక్ చేయని పత్తి విత్తనాలు, 450గ్రాములు బరువు కలిగి అరుణోదయ లేబల్ తో ఉన్న (272) పత్తి విత్తన ప్యాకెట్లను అలాగే ప్యాకెట్ సీల్ చేయడానికి వాడే (2) మిషన్లు, ఒక వేయింగ్ మిషన్, ప్రత్తి విత్తనములు పక్క చేయుటకు అరుణోదయ లేబల్ తో ఉన్న సుమారు (400) ఖాళీ పాక్కెట్లు మరియు రెండు లీటర్ల రైజోబెన్ మిశ్రమమును సీజ్ చేయడం జరిగిందన్నారు. మరో కేసులో తేదీ 27.05.2025 న ఏన్కూరు పోలీస్, మండల వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం మేరకు వెనిగండ్ల శ్రీహర్రావు అనే వ్యక్తి యొక్క వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా అక్కడ (210) ఒక కేజీ ప్యాకెట్లలో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగినది. తదుపరి వెనిగండ్ల శ్రీధర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన ఇమ్మినేని కిషోర్ ఇంటి వద్ద తనిఖీ చేయగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించాయని తెలిపారు.

అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి.. 

అలాగే పత్తి విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్ కెమికల్ మరియు వేయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెనిగండ్ల శ్రీహర్రావు గత కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉన్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో రూ.800/-కి నకిలీ, ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏనుకూరు మండల రైతులకు అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ.2,600/-లకు విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడని వివరించారు. అదేవిధంగా శుక్ర వారం ఉదయం 9 గంటల సమయంలో ఎస్సై ఏన్కూరు గారికి వచ్చిన సమాచారం మేరకు ఏన్కూరు గ్రామంలో పోలేటి కోటేశ్వరరావు గారి ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ ప్రతి విత్తనాల ప్యాకెట్ (20) ప్యాకెట్లు లభ్యమైనది. అతనిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి జిల్లా నుండి తీసుకొచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రత్తి విత్తనాలను అమ్ముతున్నాడని తెలిసింది.

నిందితుల వివరాలు 

❄️A1:- వెనిగండ్ల శ్రీహరి రావు తండ్రి: సంజీవరావు, 60 సం, కమ్మ, వ్యాపారం R/o హిమం నగర్ .
❄️A2: ఉమ్మనేని నరేష్, వయస్సు 39 సం , R/o ఏనుకూరు.
❄️A3: అన్నెం లక్ష్మీనారాయణ 60 సం, R/o భీమవరం గ్రామం, ఇంకొల్లు మండలం
❄️A4:-గూగులోతు గోపి 40 సం, R/o హిమం నగర్
❄️A5:- వరదబోయిన రమేష్, 40 years, R/o రేపల్లెవాడ
❄️A6: తాంబళ్ళ నవీన్ R/o రేపల్లెవాడ
❄️A7: దొంతబోయిన రమేష్ R/o రేపల్లెవాడ

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు