Minister Komatireddy: బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ముందే చెప్పా అని, మంత్రి కోమటి రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ టెంపరరీ పార్టీ, అది పెద్ద డ్రామా కంపెనీ బిడ్డ, కొడుకు, అల్లుడు పదవి కోసం కొట్లాడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడం ఖాయం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు. దలితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని, మూడెకరాలభూమిఇస్తా మని మోసం చేశారని అన్నారు.
కేజి టూ పీజీ విద్య అమలు చేస్తామని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వాల్లు కట్టేవి డబ్బా ఇల్లు అని, నేను డభుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అన్నారని, అది నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. కానీ రెండవ సారీ ఏలక్షన్ల ముందు రైతులకు రైతు భందు ఇస్తామని చెప్పి ప్రజలను అటు రైతులను మోసం చేసారని అన్నారు. లక్షరుణమాఫి ఎగ్గోట్టారని అన్నారు. కాళేశ్వరం లేదు ఎంలేదు ముందు మీ దుకాణం చక్కదిద్దు కొండని ఎద్దేవ వేశారు. మీరంతా నిమ్మలంగా కలిసి వుడండి లేదంటే ఉన్న పదిసీట్లు కూడా రావని మంత్రికోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
AlsoRead: Gaddar film Awards: గద్దర్ అవార్డులు.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ.. మిగతా విజేతలు వీరే!
కాంగ్రెస్ పై మాట్లాడే హక్కులేదు
పోయిన ఎలక్షన్లో 39 సీట్లువచ్చాయి ఓక పదిమంది ఎమ్మెల్యేలు పోయినారు కానీ ఇ సారీ ప్రజలు అవి కూడా నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కవితకు కేటీఆర్ కు కాంగ్రెస్ పై మాట్లాడే హక్కు లేదని అన్నారు. కొడుకు, బిడ్డా, అల్లుడు మొత్తం కుటభం అంతాకలిసి పదవులకోసం కొట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం అంటే సోత్తా అని అన్నారు. ఈ నాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తి బడుగు బలహీణ వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ టిపీసీసీ అధ్యక్షుడయ్యారని, అన్నారు. కవిత కేటీఆర్ మాటకు నేను స్పందించనని వాల్లకు నేను స్పదించే అంతా అర్హతలేదని అన్నారు. ఒకవేల నేను స్పందించాలంటే కేసీఆర్ మాత్రమే మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తానని మంత్రికోమటి రెడ్ది వెంకట్ రెడ్డి అన్నారు.
Also Read: Meenakshi Natrajan: మీనాక్షి మార్క్ మొదలు.. ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్!