YS Sharmila And Kavitha
Politics, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kavitha And Sharmila: ఓరి బాబోయ్.. కవిత, వైఎస్ షర్మిల ఇలా సింక్ అవుతున్నారేంటి?

Kavitha And Sharmila: అవును.. కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల ఇద్దరి వ్యక్తిగత, రాజకీయ జీవితంలో చాలా విషయాల్లో సింగ్ అవుతున్నాయి. అచ్చుగుద్దినట్లుగానే అన్ని విషయాలు ఒక్కటిలా ఉన్నాయి. నిజంగా ఎంత విచిత్రమంటే.. బహుశా సినిమాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం చాలా కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే రీల్ (సినిమా) లైఫ్‌లో కూడా చోటుచేసుకోవడానికి కూడా వీలుకాని పరిణామాలు రియల్ (నిజ) జీవితంలో జరిగాయి, జరుగుతున్నాయ్.. జరగబోతున్నాయ్ అంటే అసలు ఆ ఊహ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకీ ఈ ఇద్దరి జీవితంలో ఏం జరుగుతోంది? ఎందుకీ ఆరాటం, పోరాటం..? ఎక్కడ్నుంచి ఎటు వెళ్తోంది.. ఈ ఇద్దరి వ్యవహారం? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం తెలుసుకుందాం రండి. బహుశా ఈ కథనం చదివిన తర్వాత మీరు కూడా ఇలా, ఎలా ఈ ఇద్దరి జీవితాలు సింక్ అయ్యాయ్? అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు అంతే..


Read Also- YSRCP: వంశీ విడుదల సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు?

YSR And KCR


ఇద్దరూ మహా నేతల బిడ్డలే!
వైఎస్ షర్మిల, కవిత ఇరువురూ మహానాయకులు.. అంతకుమించి రాజకీయ చాణక్యుల బిడ్డలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ ఆరంభం మొదలుకుని ఇప్పటి వరకూ పడి, లేచిన సంఘటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పుట్టుక, ప్రత్యేక రాష్ట్రం సాధించడం, అధికారం చేజిక్కించుకోవడం.. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే సమయంలో ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. కేసీఆర్ ముద్దుల కుమార్తే కల్వకుంట్ల కవిత. కేటీఆర్ పెద్దవాడు కాగా, కవిత రెండో సంతానం. రాజకీయంగా పెద్దగా కష్టాలేమీ పడకుండానే పదవులు అనుభవించారు, ఇప్పటికీ కీలక హోదాలోనే ఉన్నారు. ఇక వైఎస్ షర్మిల విషయానికొస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YSR) రెండో సంతానం. వైఎస్ జగన్ పెద్దవాడు. వైఎస్సార్ గురించి తెలుగు రాష్ట్రాల, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి రెండు, మూడు తరాలకు కూడా తెలుసు. రాజకీయ పోరాటం, పాదయాత్ర, పదవులు, ముఖ్యమంత్రి కావడం, చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు తీసుకురావడం ఇవన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్ లాంటి పథకాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇప్పటికీ అమలు చేస్తున్నాయంటే వైఎస్ రేంజి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే పెద్దాయన బతికుండగా షర్మిల రాజకీయంగా అడుగులు పడలేదు కానీ, అన్న జగన్ కోసం అహర్నిశలు కష్టపడి.. వైసీపీ అధికారంలోకి రావడానికి శక్తికి మించి పోరాటం చేశారు.

Sharmila and Kavitha

Read Also- YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. ఏం జరిగిందంటే..?

ఇద్దరి భర్తల పేర్లు అనిల్..!
వైఎస్ షర్మిల, కవిత వ్యక్తిగత జీవితంలో కూడా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. షర్మిల భర్త పేరు బ్రదర్ అనిల్ కుమార్ (Brother Anil Kumar) కాగా.. కవిత భర్త పేరు కూడా అనిల్ కుమారే కావడం ఇదో ఆస్తికర పరిణామమే అని చెప్పుకోవాలి. బ్రదర్ అనిల్ క్రిస్టియన్ పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపారాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక కవిత భర్త కూడా పెద్ద పెద్ద వ్యాపారాలే చేస్తున్నారు. వ్యాపారవేత్తల కుటుంబం వీళ్లది. అయితే వైఎస్, కేసీఆర్‌లాగా అనిల్-అనిల్ మధ్య ఎలాంటి పరిచయాలు, సంబంధాలు మాత్రం లేవు. అయితే కవిత-షర్మిల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా విబేధాలు మాత్రం ఓ రేంజిలో ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో వైఎస్సార్టీపీ ఆవిర్భావం మొదలుకుని నిన్న మొన్నటి కాంగ్రెస్ విలీనం వరకూ తెలంగాణలో బీఆర్ఎస్‌పైన పెద్ద యుద్ధమే చేశారు షర్మిల. ఇద్దరి మధ్య మాటల తూటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు.. ఇవన్నీ చాలవన్నట్లుగా ట్విట్టర్ వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు సైతం నడిచాయి. అలా ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇరువురి మధ్య రాజకీయంగా నెలకొన్న రచ్చలతో ఎన్నోసార్లు వార్తల్లోకెక్కారు కూడా. ఇది పూర్తిగా యాదృచ్ఛికమైనా, రాజకీయంగా ఇది ఒక క్యూరియసిటీ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

Jagan And Ktr

ఇద్దరిదీ సోదరులపైనే తిరుగుబాటు!
వైఎస్ మరణించడం, వైఎస్ జగన్ జైలుకెళ్లడంతో తొలిసారి రాజకీయ జీవితం ఆరంభించిన షర్మిల.. తనదైన శైలిలో రాజకీయం చేశారు. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయ, అన్నను మించిన చెల్లి అంటూ తెలుగు ప్రజలే పొగడ్తలతో ముంచెత్తే పరిస్థితి. జగన్ జైలుకెళ్లిన తర్వాత పార్టీని భుజాలపై వేసుకుని క్యాడర్‌ను ముందుకు నడిపించడం, వైసీపీ ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల ఫలితాల వరకూ షర్మిల పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇంత చేసిన తనను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నయ్య పట్టించుకోలేదని వేరు కుంపటి పెట్టడం, పార్టీని స్థాపించడం, కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం ఇలా అటు తిరిగి, ఇటు తిరిగి ఆఖరికి నాడు ‘జగనన్న వదిలిన బాణం’ కాస్త ఆయనపైకే శరవేగంతో వెళ్తున్న పరిస్థితి. అటు రాజకీయంగా ఫైట్.. ఇటు వ్యక్తిగతం ఆస్తుల విషయంలో వైఎస్ ఫ్యామిలీలో (YS Family) పెద్ద తతంగమే నడుస్తున్నది. అలా అన్నయ్యపై చెల్లి తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. ఇక కవిత విషయానికొస్తే.. కవిత రాజకీయంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. జాగృతి ఫౌండేషన్ పేరుతో తొలి అడుగు వేసిన ఆమె.. పార్టీ బలోపేతానికి కానీ, ఉద్యమాల్లో కానీ కవిత పోషించిన పాత్ర పెద్దగా ఏమీ లేదనే చెప్పుకోవాలి. కేసీఆర్ కుమార్తెగా, అతి సులువుగా ఎంపీగా ఎన్నికయ్యారు. పదవి అనుభవిస్తూ తనకు కావాల్సినవన్నీ చేసుకున్నారు కూడా. అయితే తనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు, హోదా లేకపోవడం.. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు, డియర్ డాడీ అంటూ రాసిన లేఖ, ఆ తర్వాత ఇరువురి మీడియా సమావేశాలు.. ఇవన్నీ కేటీఆర్ వర్సెస్ కవితగా పరిస్థితులకు దారితీశాయి. చివరికి అన్నపైనే కవిత పోరుబాట పట్టిన పరిస్థితి త్వరలో వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు షర్మిల.. ఇటు కవిత.. సోదరులపై పోరులోనూ సింక్ అయ్యింది.

Kavitha

ఎంత విచిత్రమో కదా..?
చూశారు కదా.. షర్మిల, కవిత వ్యక్తిగత, రాజకీయ జీవితాలు ఎలా ప్రారంభం అయ్యాయి? ఎక్కడి వరకూ వచ్చాయనేది. ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిల రాజకీయ జీవితం ‘ముళ్ల మీద నడక’గా సాగింది.. ఇంకా సాగుతోంది కూడా. కవిత విషయంలో మాత్రం ‘గులాబీ పూల మీద బాట’గా నిన్న, మొన్నటి వరకూ సాఫీగా సాగిపోగా.. ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అక్కడ జగన్ రెడ్డితో షర్మిల తనకు తానుగా విబేధించలేదు కానీ.. తన కష్టాన్ని గుర్తించకపోవడం, కనీసం కార్యకర్తగా కూడా వైసీపీలో చూడకపోవడంతో తీవ్ర అసహనం, అవమానం అంతకుమించి ఆక్రోశంతో బయటికొచ్చి అన్నకే బాణంలా గుచ్చుకుంటున్నారు అంతే. కవిత మాత్రం తనకు హోదా, పదవుల దక్కినా వ్యక్తిగత, రాజకీయ అంశాల్లో కొన్ని విబేధాలు రావడంతో చేసేదేమీ లేక ఇంచుమించు షర్మిల లాగే అన్నపై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా పరిస్థితులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడిన షర్మిల.. పార్టీకి బలంగా ఉన్నారే తప్ప ఎక్కడా భారం కాలేదు. కవిత మాత్రం పార్టీకి, ఫ్యామిలీకి భారమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరువురి జీవితాల్లో రాజకీయం, విచిత్ర కయ్యం ఎలా మొదలై.. ఎక్కడి వరకూ వచ్చిందో చూశారుగా..!

YS Sharmila

 

Read Also-Telangana: త్వరలో కవిత రెండో లేఖ.. హరీశ్ నేతృత్వంలోనే చీలిక రాబోతోందా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?