Telangana: బీఆర్ఎస్‌లో త్వరలోనే మరో చీలిక రాబోతోందని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే గులాబీ బాస్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఎపిసోడ్‌తో.. పార్టీలో అసలేం జరుగుతోందో అని తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతల నుంచి వస్తున్న కామెంట్స్‌తో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నేతలు మాట్లాడుతున్న మాటల్లో ఎంతవరకూ నిజం ఉందో లేదో తెలియట్లేదు కానీ, కారు పార్టీ క్యాడర్ మాత్రం హడలెత్తిపోతోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు, మంత్రులు, బీజేపీ నేతలు స్పందించగా తాజాగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్, కవితపై జోస్యం చెప్పారు. ‘ హరీష్ రాశ్ నేతృత్వంలో ఈ రెండో చీలిక జరగబోతోంది. హరీష్ రావు (Harish Rao) బీఆర్ఎస్‌లో అనేక అవమానాలు, అవహేళన ఎదుర్కొంటున్నారు. త్వరలోనే హరీశ్ తన స్టాండ్‌ను కూడా ప్రకటిస్తారని అనుకుంటున్నాను. కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ (BRS) నాలుగు ముక్కలాటగా మారింది. అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. కేటీఆర్ విదేశీ టూర్‌లో ఉన్నప్పుడే మేజర్ ఇష్యూ బీఆర్ఎస్‌లో జరగబోతుందంటూ నేను ముందే చెప్పాను’ ఏలేటి గుర్తు చేశారు.
Read Also- Kavitha: కవిత లేఖ తర్వాత కీలక పరిణామం.. తేల్చేసిన కేసీఆర్.. కొత్త పార్టీ పక్కా!?
త్వరలో మరో లేఖ!
‘ కవిత లేఖలో ఆవేదన కనిపిస్తోంది. కవిత ఎదగడం కేటీఆర్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆస్తుల పంపకంలో సైతం కవితకు అన్యాయం జరుగుతోందని ఆవేదన ద్వారా తెలుస్తోంది. కవిత ప్రస్టేషన్లో బీజేపీతో పొత్తు అంటూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తోంది. అవినీతి పార్టీలను విలీనం చేసుకునే పద్ధతి బీజేపీలో లేదు. బీఆర్ఎఎస్‌ను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి ఏమాత్రం లేదు. కవిత రెండ్రోజుల్లో తన తండ్రికి మరో లేఖ రాయబోతోంది. కోవర్టులు తమ పార్టీలో ఎవరూ లేరు. కవితకు వాళ్ళ అన్న కేటీఆర్ కోవర్ట్‌గా అనుమానం ఉందేమో. కవిత సొంత పార్టీ పెట్టుకుంటుందా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా? అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ పతనం వైపుగా వేగంగా పరిగెడుతోంది. సొంత పార్టీలో ఎదుగుదల లేదని కవిత ఇప్పటికే డిసైడ్ అయింది’ అని ఏలేటి జోస్యం చెప్పేశారు.
Read Also- Vallabhaneni Vamsi: వంశీకి హైకోర్టు బెయిల్.. కాసేపట్లో విడుదల
మాకేం అవసరం..?
కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చు.. కానీ బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ఇవ్వాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదన్నారు. ‘ తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోంది. కవిత కలిసి ఏం చేస్తుంది? తెలంగాణవాదులంతా కొందరు చనిపోయారు, కొందరు ఇంకెక్కడో ఉన్నారు. కవిత వద్ద కనీసం ఉద్యమకారుల లిస్ట్ ఉందా? పక్క రాష్ట్రం ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే బాగుండని ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో ఎందుకు విలీనమవుతుంది? మాకేం అవసరం? బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయబోదు. నీచ రాజకీయాల మేం చేయబోం. పదేండ్లలో కేసీఆర్‌ను నమ్మి మోసపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారు. పక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోంది. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే గాలి వార్తలకు నేను సమాధానం చెప్పబోను. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే, దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతాను. అది సంస్కారం’ అని ఈటల రాజేందర్ వెల్లడించారు. చూశారుగా.. బీజేపీ నేతలు ఎవరు ఎలా మాట్లాడారో, ఎవరి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో..? మున్ముందు బీఆర్ఎస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో..? ఇవన్నీ అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌కు ఎలా ఉపయోగపడుతాయో చూడాలి మరి.
Read Also- YSRCP: వంశీ విడుదల సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు?