harish rao resignation letter
Politics

Hyderabad: రాజీనామా.. హైడ్రామా..!

– గన్ పార్క్ దగ్గర హరీశ్ రావు హల్ చల్
– స్పీకర్ ఫార్మాట్‌లో లేకుండా రాజీనామా లేఖ
– సీఎం రేవంత్ రాజీనామాకు డిమాండ్
– అంతా డ్రామా అంటూ కొట్టిపారేస్తున్న హస్తం శ్రేణులు
– నిజంగా రిజైన్ చేసే ఉద్దేశం ఉంటే స్పీకర్‌కు ఇవ్వాలి
– అంతేకానీ, మీడియా ముందు మామూలు లేఖ ఇస్తే ఉపయోగమేంటి?
– పబ్లిసిటీ స్టంట్ కోసం డ్రామా క్రియేట్ చేశారంటూ విమర్శలు

హైదరాబాద్, స్వేచ్ఛ: లోక్ సభ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజీనామాల రాజకీయం ఓ రేంజ్‌లో జరుగుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావు లేవనెత్తిన అంశాలతో ఈ రిజైన్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయదని, అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో అద్భుతం చూపినట్టుగానే ఈసారి కూడా రుణమాఫీ చేస్తామని కబుర్లు చెబుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాము ఎన్నికల్లో ప్రకటించినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, పంద్రాగస్టులోగా రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ, రుణమాఫీ ఆగస్టు 15లోపు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, అమలు చేస్తే రాజీనామా చేయడానికి సిద్ధం తాను సిద్ధమని, లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఆరునూరైనా, భూమి ఆకాశం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. హరీశ్ రావు తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని జేబులో పెట్టుకోవాలని కౌంటర్ సవాల్ విసిరారు. సీఎం ఎంతకీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు శుక్రవారం గన్ పార్క్ దగ్గర హల్ చల్ చేశారు. రాజీనామా లేఖను పట్టుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉపఎన్నికలోనూ పోటీ చేయనని అన్నారు. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్టాఫ్‌తోనైనా పంపించాలని చెప్పారు.

సీఎం రేవంత్ సెటైర్లు

మోసం చేయాలనుకునే ప్రతిసారీ హరీశ్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తుకు వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లూ ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకువచ్చి దాన్ని రాజీనామా లేఖ అంటున్నాడని, రిజైన్ లెటర్ అలా ఉండదని అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని పేర్కొన్నారు. హరీశ్ రావు తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చాడని, తెలివి ప్రదర్శిస్తున్నాడని చెప్పారు. హరీశ్ రావు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లకు జారినట్టు ఉన్నదని సెటైర్లు వేశారు. ‘హరీశ్ రావు, ఇప్పటికీ చెబుతున్నా. నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’ అని స్పష్టం చేశారు సీఎం.

Also Read: ప్రజాస్వామ్యానికి నమ్మకం ముఖ్యం.. గుడ్డిగా అనుమానిస్తే ఎలా? 

హరీశ్ రావుకు కాంగ్రెస్ పది ప్రశ్నలు

1. హరీష్ రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో ఎందుకు లేదు?
2. స్పీకర్ కార్యాలయంలో ఎందుకు సబ్మిట్ చేయలేదు?
3. స్పీకర్ ఫార్మాట్‌లో ఇస్తే రాజీనామా ఆమోదిస్తారని భయపడ్డారా?
4. బీఆర్ఎస్‌ను మూసివేస్తారా అనే సవాల్‌కు ఎందుకు రిప్లై ఇవ్వలేదు?
5. పబ్లిసిటీ కోసమే రాజీనామా లేఖ పట్టుకొచ్చారా?
6. బీఆర్ఎస్ నాయకత్వాన్ని డైలమాలో పడేశారా?
7. పార్టీ మూసివేత సవాల్‌పై కేసీఆర్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిందా?
8. ఇదంతా బీఆర్ఎస్‌లో పట్టు కోసం చేసిన ప్రయత్నమా?
9. హరీశ్ రాజీనామా వ్యవహారంపై ఇంతవరకూ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు?
10. సీఎం రేవంత్ స్పష్టంగా సవాల్ చేసినా, ఎందుకు డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు?

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..