Gaddar Film Awards 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 2024కు గానూ ఎంపిక కాబడిన వారి వివరాలను జ్యూరీ ఛైర్ పర్సన్, నటి జయసుధ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను వెల్లడించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని, ప్రతీది పరిశీలించిన అనంతరం ఫైనల్‌గా అవార్డు పొందిన విజేతలను ప్రకటించామని జయసుధ (Jayasudha) చెప్పుకొచ్చారు. ఈ అవార్డుల ప్రకటన అనంతరం, అవార్డు వచ్చిన వారంతా సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్నారు. సినిమా వాళ్లు హడావుడి చేశారంటే అర్థం ఉంది కానీ, ఒక ఓటీటీ సంస్థ కూడా సంబరాలు జరుపుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పబడుతోంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదో పై పోస్టర్ చూస్తుంటేనే తెలిసి పోతుంది కదా.. అవును ఆహా ఓటీటీనే. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read- Gaddar Film Awards: ఉత్తమ నటుడిగా అవార్డ్.. అల్లు అర్జున్ స్పందనిదే!
తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ (Tollywood)కు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్‌లో ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న మూవీస్ సత్తా చాటాయట. పలు మేజర్ కేటగిరీల్లో ఆహా మూవీస్ అవార్డ్స్ గెల్చుకోవడంతో, ఈ అవార్డ్ ఏదో తమకే వచ్చినట్లుగా వారు ఫీలైపోతున్నారు. ఆహా ఓటీటీ వెల్లడించిన అవార్డుల విషయానికి వస్తే.. సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా ‘పొట్టేల్’, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా ‘35 ఇది చిన్న కథ కాదు’ అవార్డ్స్ దక్కించుకున్నాయి. ‘35 ఇది చిన్న కథ కాదు’ మూవీలో నటనకుగానూ నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, ‘రజాకార్’ మూవీకి మంచి సంగీతాన్ని అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డ్స్‌ను గెలుచుకున్నారు.
Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!
అలాగే ‘35 ఇది చిన్న కథ కాదు’లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, ‘మెర్సీ కిల్లింగ్’లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. ‘రాజు యాదవ్’ సినిమాలోని పాటకు బెస్ట్ లిరిసిస్ట్‌గా చంద్రబోస్, ‘రజాకార్’ మూవీకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్‌గా నల్ల శ్రీను ఈ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. ‘పొట్టేల్’ మూవీలో నటనకు అనన్య నాగళ్ల, ‘రాజు యాదవ్’ మూవీకి నిర్మాతలుగా ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గెల్చుకున్నారు. తమ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలకు ప్రధాన విభాగాల్లో ఈ అవార్డ్స్ దక్కడంపై ఆహా టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అవార్డ్స్ వివరాలతో పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆహా ఓటీటీ (Aha OTT) టీమ్ స్పందిస్తూ.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్‌లు, షోలను అందించడంతో పాటు.. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని సాంస్కృతిక వైభవాన్ని చాటే కంటెంట్‌ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలిపింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు