Producer JJ
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: టాలీవుడ్‌కు మరో న్యూ బ్యానర్.. త్వరలోనే భారీ సినిమా!

Tollywood: ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీ చూసినా నిర్మాతల కొరత ఎలా ఉందో తెలియంది కాదు. సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఓ నాలుగైదు పెద్ద సంస్థలు తప్పితే.. కొత్తగా వచ్చిన ఏ బ్యానర్ కూడా రెండు మూడు సినిమాలు మినహా మళ్లీ కనిపించడం లేదు. ఈ మధ్య కూడా చాలానే బ్యానర్లు పుట్టుకొచ్చాయి కానీ, ఎక్కువ కాలం మనుగడ సాధించలేకపోతున్నాయి. కారణం జనాలు థియేటర్లకు రాకపోవడమే. సినిమా వ్యాపారం లాభసాటిగా లేకపోవడమే. అందులోనూ కొత్తగా వచ్చే వారికి ఇక్కడున్న మెళకువలు కూడా తెలిసి ఉండాలి. ఇక్కడున్న సిస్టమ్‌పై కూడా అవగాహన ఉండాలి. కొంతమంది నిర్మాతలు సినిమాను పూర్తి చేసి కూడా విడుదల చేయలేకపోతున్నారు. అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయినా కూడా సినిమా మీద ప్యాషన్‌తో కొందరు నిర్మాతలు ఉంటారు. వారికి లాభనష్టాలతో పని ఉండదు. ఉత్తమమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలనేది ధ్యేయంగా ఉంటుంది. అలాంటి ధ్యేయంతోనే టాలీవుడ్‌లోకి మరో నూతన బ్యానర్ అడుగు పెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Nara Lokesh: నారా లోకేష్ నోట అల్లు అర్జున్ డైలాగ్.. మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!

ప్రపంచ స్థాయిలో టాలీవుడ్ (Tollywood) మన్ననలను అందుకుంటున్న సమయమిది. టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా దృష్టంతా ఆ సినిమాపైనే పడుతోంది. ఇలాంటి టాలీవుడ్‌ రేంజ్‌ని మరింతగా పెంచేందుకు వస్తున్నామని అంటున్నారు ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ (Somo Ironic Art Creations) సంస్థ నిర్మాత జేజే (JJ). గురువారం ఆయన తన బ్యానర్ లోగోని లాంచ్ చేశారు. అనంతరం మీడియాతో నిర్మాత జేజే ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే.. టాలీవుడ్‌లోకి నిర్మాతగా వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి కొత్త వారిని టాలీవుడ్ ఎంతో ఘనంగా స్వాగతిస్తోంది. ఇక్కడి పెద్దలు మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్‌లో మా సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేశాం. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా మాకు మంచి సహకారం లభించింది. మా సంస్థ లోగోను నేడు ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సంస్థ లోగోలో చూపించినట్టుగా ఆ వెలుగుని అంతటా పంచాలనేది మా ఉద్దేశం.

Also Read- OG Movie: నారా రోహిత్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అప్డేట్ ఇదే!

చిత్ర పరిశ్రమలో పరస్పర సహకారం, ఎదుగుదల అనే కాన్సెప్ట్‌తో ఆ లోగోను డిజైన్ చేయించాము. కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి, కొత్త కథల్ని తెరపైకి తీసుకు రావడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌పై త్వరలో ఒక భారీ సినిమా ప్రారంభించబోతున్నాం. ఆ వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తాం. భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే మా లక్ష్యం. మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలలో మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులలో నమ్మకాన్ని కలిగించేలా వర్క్ చేస్తామని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే