Hyderabad Crime: నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి భంన కార్మికుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ లోని మదీనగూడలో నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుడిగా పనిచేస్తున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన బికెన్ (21) ప్రమాదవశాత్తు భవనం పైనుండి మూడవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బికెన్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటన తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం భవన యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Telangana Politics: స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ కోసం పక్కా ప్లాన్?
సరైన జాగ్రత్త చర్యలు తీసుకోనందునే
మియాపూర్‌లోని మదినాగూడలో కొనసాగుతున్న నిర్మాణం పట్ల యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
చర్యలు తీడుకుంటాం:చందానగర్ డీసీ మోహన్ రెడ్డి
మియాపూర్ మదినాగుడలో అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సదరు నిర్మాణంపై స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. మరోసారి పరిశీలించి, అనుమతులు రద్దు చేసి, భవనాన్ని సీజ్ చేస్తాంమని, చందానగర్ డిసీ మోహన్ రెడ్డి అన్నారు.
Also Read: Central on Kharif Crops: అన్నదాతకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా పంట మద్దతు ధరలు పెంపు