Hyderabad Blast Conspiracy: హైదరాబాద్, విజయగనరం పేలుళ్ల కుట్ర కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఐదో రోజు జరిపిన విచారణలో మసీదులను కేంద్రంగా చేసుకుని వందల సంఖ్యలో స్లీపర్ సెల్స్‌ను తయారు చేయాలని కుట్రలు చేసినట్టుగా వెల్లడైంది. వీరిలో ఎంపిక చేసుకున్న వారిని మానవ బాంబులుగా మార్చాలని పన్నాగాలు పన్నినట్టు తేలింది. దీని కోసం సౌదీ నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించాలని అనుకున్నట్టుగా తేలింది. అల్హింద్ఇత్తెహాదుల్ ముస్లిమీన్సంస్థను ప్రారంభించిన సిరాజ్ ఇటు హైదరాబాద్‌తో పాటు అటు విజయనగరంలో టిఫిన్‌బాక్స్ బాంబులు పేల్చటానికి కుట్రలు చేసిన విషయం తెలిసిందే.
దీనికోసం హైదరాబాద్ బోయిగూడకు చెందిన సమీర్‌తో కలిసి పేలుడు పదార్థాలు, ఇతర పరికరాలను కూడా సేకరించాడు. అయితే, చేసిన కుట్రలను అమలు చేసే ప్రయత్నాల్లో ఉండగానే తెలంగాణ కౌంటర్‌ఇంటెలిజెన్స్, విజయనగరం పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో వారం రోజులపాటు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ, ఏటీఎస్, తెలంగాణ కౌంటర్‌ఇంటెలిజెన్స్, విజయనగరం పోలీసులు కలిసి విచారణ చేస్తున్నారు.
Also Read: Internet Weight: ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
సౌదీ విరాళాలతో
సౌదీలోని తన హ్యాండ్లర్లతో పాటు ఇతరుల నుంచి భారీ మొత్తాల్లో విరాళాలు సేకరించి ఆ డబ్బుతో మసీదులు కట్టించాలనుకున్నట్టు సిరాజ్ తాజాగా వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా కట్టించిన మసీదుల్లో వందల మంది యువకులకు ఆశ్రయం కల్పించి వారందరినీ పవిత్ర యుద్ధం పేరిట ఉగ్రవాద బాటలోకి నడిపించాలని ప్లాన్ చేశానని చెప్పినట్టు సమాచారం. ఈ యువకుల్లో ఎంపిక చేసిన వారిని జన్మత్మిలేగా (స్వర్గంలో చోటు దొరుకుతుంది) అని చెప్పి మానవ బాంబులుగా తయారు చేయాలని కూడా అనుకున్నానని వెల్లడించినట్టు తెలిసింది. ముందుగా ప్రశాంతంగా ఉండే విజయనగరంలో టిఫిన్ బాక్స్బాంబులు పేల్చాలని కుట్రలు చేశానని చెప్పినట్టుగా తెలియవచ్చింది.
ఢిల్లీ చోట్ల కూడా పేలుళ్లు
అలా జరిగి ఉంటే తాను ప్రారంభించిన అల్హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుందని అనుకున్నానని చెప్పినట్టు సమాచారం. విజయనగరంలో ప్లాన్సక్సెస్అయితే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర చోట్ల కూడా పేలుళ్లు జరపాలని కుట్రలు చేశానని వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే తనలాంటి భావజాలమున్న కొంతమందిని అల్ హింద్ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌లో సభ్యులుగా చేర్చినట్టుగా చెప్పాడని సమాచారం. కాగా, అదుపులో ఉన్న సిరాజ్‌తో దర్యాప్తు అధికారులు సీన్రీ కన్ స్ట్రక్షన్చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. విజయనగరం శివార్లలోని డబుల్ కాలనీలో సిరాజ్ ఓ గదిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గదిలోనే బాంబులు తయారు చేయాలని అతను భావించాడు. ఈ క్రమంలోనే విచారణాధికారులు అతనితో సీన్రీకన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది.
Also Read: Fake iPhone Spare Parts: కోటి రూపాయల.. ఐఫోన్ నకిలీ విడిభాగాలు సీజ్!