Local Body election (imagecredit:twitter)
తెలంగాణ

Local Body election: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సర్కారు ప్రిపరేషన్ స్పీడప్!

Local Body election: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే15 నుంచి 20 రోజుల్లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్న సర్కార్, జూలై లోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కార్ రీసెర్చ్ మొదలు పెట్టింది. గ్రామ స్థాయిలోనే కుల గణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తున్నది. వార్డుల వారీగా కూడా అధ్యయనం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రిపోర్టు ప్రభుత్వానికి చేరనున్నది. ఆ తర్వాత ప్రాసెస్ మరింత స్పీడప్ కానున్నది. ఇక దేశ వ్యాప్తంగా మొదట తెలంగాణలోనే కుల గణన పూర్తయింది. కేంద్రం జన గణన నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించింది.

రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తుందా!

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. పైగా డెడికేషన్ కమిషన్ రిపోర్టు, బీసీ కుల గణన పై అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు కేంద్రంతో పాటు రాష్ట్రపతికి చేరాయి. వీటికి ఆమోదం లభిస్తుందనే అభిప్రాయంలోరాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్రం నుంచి రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే బీజేపీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ చేతిలో మరో ఆస్త్రం లభించే ఆస్కారం ఉన్నది. ఒక వేళ కేంద్రం ప్రకటించినట్లు జన గణన ప్రారంభించడానికి మరో మూడు నెలల సమయం పట్టడమే కాకుండా, దీన్ని పూర్తి స్థాయిలో డేటా తీసుకునేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నది. దీంతో తెలంగాణలో పూర్తి చేసిన కులగణన ఆధారంగానే రిజర్వేషన్స్ అమలు చేసుకోవాలని కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. కేంద్రం వీటికి అంగీకరించకపోతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు సాగాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు తగిన స్థాయిలో వివిధ సెక్టార్ల నుంచి అభిప్రాయ సేకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక 42 శాతం రిజర్వేషన్ అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ ఇప్పటికే స్టేట్ బీసీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసింది.

Also Read: MP Raghunandan: కవిత కొత్త పార్టీ వెనక కేసీఆర్.. త్వరలో పాదయాత్ర.. బీజేపీ ఎంపీ

ఎంపీటీసీ, జడ్పీటీసీల వైపు పార్టీ. సర్పంచ్‌లపై మంత్రులు మొగ్గు?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనే ముందు నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లో ఉన్నంత కాలం ఎంపీటీసీ, జడ్పీడీసీ ఎన్నికలనే తొలుత నిర్వహించినట్లు ఓ కీలక నాయకుడు తెలిపారు. దీంతో పార్టీ ఆ ట్రెండ్ ను ఫాలో అయ్యే అవకాశం ఉన్నదన్నారు. కానీ క్యాబినెట్ లోని కొందరు మంత్రులు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు వివరించారట. సర్పంచ్‌లు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే క్షేత్రస్థాయిలో మైలేజ్ వస్తుందనేది సర్కార్ బావన. స్కీమ్స్, ప్రోగ్రామ్స్ వంటి అమల్లో హాడావిడి నెలకొంటుందని, ఇప్పుడు సర్పంచ్‌లు లేనందున ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా మైలేజ్ లో కొంత వెనకబడుతున్నట్లు మంత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా సర్పంచ్‌లు పవర్ లోకి వస్తే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. కేంద్రం నుంచి దాదాపు పదిహేను వందల కోట్లు నిధులు రావాల్సి ఉన్నదని ఓ అధికారి తెలిపారు.

ఎలక్షన్ కమిషన్ ప్రిపరేషన్?

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రిపేర్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. పలుమార్లు వివిధ డిపార్ట్ మెంట్లతో రివ్యూలు నిర్వహించి ఎన్నికల తేదీలు, ఏర్పాట్లు, ప్లానింగ్ వంటి వాటిపై చర్చించింది. రిజర్వేషన్ల కోసమే ఇంత కాలం వెయిట్ చేసినట్లు ఎన్నికలు సంఘంలోని ఓ అధికారి తెలిపారు. దానిపై తమకు ఓ క్లారిటీ వచ్చిందని, సీఎం రాగానే డిస్కషన్ చేసి నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. లోకల్ అథారిటీస్ కూడా ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేస్తున్నామని, అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు.

Also Read: Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

 

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు