Bus Catches Fire: కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం బలిజాపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిరిసిల్ల నుంచి కాళేశ్వరానికి ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బుకింగ్ చేసుకుని భక్తులు వచ్చారు. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి సురక్షితంగా అందరు బయటపడ్డారు.
వివరాల్లోకి వెలితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాఱమై వస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. సిరిసిల్లకు చెందిన కొంత మంది భక్తులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెల్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకున్నారు. దైవ దర్శనం తర్వాత కాళేశ్వరం నుండి సిరిసిల్లాకు తిరుగు ప్రయాణం అయ్యారు. మద్దులపల్లి, అన్నారం మీదుగా ప్రైవేట్ బస్సు ప్రయానిస్తున్న సమయంలో బస్సు ఏసీలో షాక్ సర్క్యుట్ అయింది.
Also Read: Formula E Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ రియాక్షన్!
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 36 మంది భక్తులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వుండటంతో ప్రమాదం నుంచి అందరు తప్పించుకున్నారు. డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కిందకి దింపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులో సీట్లన్నీ దగ్ధం అయ్యాయి. కాళేశ్వరం, మద్దులపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను పోలీసులు అదుపుచేశారు.