Bhatti Vikramarka: విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా..
Bhatti Vikramarka( iamge credit: swetcha reporter)
Telangana News

Bhatti Vikramarka: విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా.. ఇది దేశ చరిత్రలోనే రికార్డు!

Bhatti Vikramarka: విద్యుత్ కార్మికులకు రూ.కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్ లో సోమవారం ఉదయం ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కుతో పాటు నరేశ్ శ్రీమతికి విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుడికి రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందించడం తమకే సాధ్యమని కొనియాడారు.

Also Read: Ganja Seized: స్కూల్ వద్ద గంజాయి అమ్మకాలు.. నలుగురి అరెస్ట్​–3.8కిలోల గంజాయి సీజ్​!

గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. రూ.కోటి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల్లో భరోసా నింపుతుందన్నారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Etela Rajender: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై.. వాస్తవాలు చెప్పాలని స్పష్టం!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?