Balagam Actor: ఇటీవలే కాలంలో ఎంతో మంది నటి నటులు మరణించారు. వారిలో చాలా మంది అనారోగ్య సమస్యల వలనే మృతి చెందారు. నిన్న బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇది మరువక ముందే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. బలగం నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్
ఈ విషయాన్ని బలగం చిత్ర దర్శకుడు వేణు సోషల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘జీవి బాబు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
Also Read: Bomb Threat Call: బెజవాడకు వరుస బాంబు బెదిరింపులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పోలీసులు