Bomb Threat Call: ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎల్ఐసి ఆఫీసుకు ఓ బెదిరింపు కాల్ రావడంతో విజయవాడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనాలు ఎక్కువగా షాపింగ్ చేసే బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంటు రోడ్డుకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. బ్యాంబ్ స్కాడ్, పోలీసులు కలిసి ఆ ప్రదేశాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసులు ఆదేశించే వరకు ఎవరూ షాపులు తెరవకూడదని తెలిపారు.
మొత్తం ఐదు బృందాలతో బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో ముమ్మర తనిఖీలు చేశారు. చిన్న షాపులు నుంచి తోపుడు బండ్ల వరకు అన్నింటిని చెక్ చేశారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి 11 గంటల వరకు . ఎక్కడా బాంబ్ ఆనవాళ్లు లేక పోవడంతో బెజవాడ ప్రజలు, అధికారుల ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్ లో బాంబ్ పెట్టారని బెదిరింపు కాల్ వచ్చింది.
రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి అగంతకుడు కాల్ చేసి చెప్పాడు. హిందీలో మాట్లాడటంతో రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనికీలు చేపట్టిన GRP,CSW, బాంబు స్క్వాడ్ బృందాలు. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపారు. బాంబు పెట్టామనే ఒక్క మాట చెప్పి ఆ అగంతకుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో, పోలీసులు స్టేషన్లో ప్రయాణికులను, ప్లాట్ ఫామ్ లను తనికీలు చేస్తున్నారు. ఉదయం నుంచి వరుస బెదిరింపులు రావడంతో ప్రజలు కూడా భయపడుతున్నారు.