Minister Konda Surekha: అటవీ ప్రాంతాల అభివృద్ధికి ఫారెస్టు డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల అభివృద్ధి రెండూ అనివార్యమేనని అన్నారు. నిబంధనలను పాటిస్తూ అటవీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్టేజ్-1లో(వెంటనే అయ్యే పనుల) గురించి రెండు, మూడు రోజుల్లో ఒక ప్రత్యేక నివేదిక అందజేయాలని ఆదేశించారు.
రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అటవీ చట్టాలు చెబుతున్నాయని, 1980 కంటే ముందు ఉన్న పల్లెల్లో రహదారులుంటే.. అవి పాడైతే అక్కడ మరమ్మతులు చేపట్టవచ్చని, అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించవచ్చని అటవీ చట్టాలు చెబుతున్నాయన్నారు. అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉంటే.. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు తెప్పించాలని సూచించారు. తునికాకు, ఇప్పపువ్వు, పండ్ల సేకరణకు వెళ్లిన ఆదివాసీలను.. గిరిజనులను ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Alos Read: Congress on KTR: కేటీఆర్ కు పైసల బలుపు.. సీఎం ను విమర్శిస్తే ఊరుకోం ఎమ్మెల్యే కామెంట్స్!
అటవీ ఉత్పత్తులు సేకరించడం గిరిజనులకు ఉన్న హక్కు అన్నారు. నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలని చెప్పారు. అటవీ భూమిని పరిరక్షించాలని, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసేలా అన్ని శాఖ అధికారులు వ్యవహరించాలన్నారు. సమావేంలో ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, కోవా లక్ష్మీ, పాల్వాయి హరీష్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్ , అటవీ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, సీసీఎఫ్, డీఎఫ్ఓలు పాల్గొన్నారు.
మేడారం జాతర కోసం ప్రత్యేక రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి… మంత్రి సీతక్క
అటవీ అభయారణ్య చట్టాలతో ములుగు వంటి ప్రాంతాల్లో సింగల్ రోడ్లు కూడా రావడం లేదని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో శనివారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో పంచాయతీ, ఆర్ అండ్ బీ, మౌలిక వసతుల కల్పనపై అటవీ శాఖ అనుమతులకు ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించేందుకు మంత్రి కొండా సురేఖతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో స్కై వేలు, హైవేలు, ఆరు వరుసల రోడ్లు వస్తున్నాయన్నారు.
రహదారి సదుపాయం లేకపోతే మా ప్రాంతాలు ఎలా అభివృద్ధి సాధిస్తాయని, మా ప్రాంతం అభివృద్ధి కావద్దా? అని ప్రశ్నించారు. సరైన రహదారులు సదుపాయాలు రాక మేము చీకట్లోనే మగ్గిపోవాలా? అడవి ప్రాంతాలు, ఆదివాసి ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే అంతరాలు పెరుగుతాయన్నారు. ఆదివాసి ప్రజల కోసం ఏజెన్సీలో బైక్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అటవీశాఖ సహకరించాలని కోరారు.
Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!
వన్యప్రాణులకు ప్రమాదం అని రహదారులు వేయనీయకపోతే ఎలా? వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడొచ్చు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం అటవీ అభయారణ్య చట్టాల్లో కొన్ని సడలింపులు ఉన్నాయన్నారు. వాటిని వర్తింపజేసి ములుగు అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించాలన్నారు. మేడారం జాతర కోసం ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలన్నారు. అటవీ పరిరక్షించబడాలి, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నారు.
Also Raed: Chamala Kiran Kumar: కవిత ఎఫెక్ట్.. నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్న కేటీఆర్.. ఎంపీ చామల