క్రైమ్

Hyderabad : ఫోన్ ట్యాపింగ్‌లో సైబర్ టెర్రరిజం

– ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం
– ఐటీ యాక్ట్ 66(ఎఫ్) ప్రయోగించిన పోలీసులు
– సెక్షన్ జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు
– కేసు నిరూపణ అయితే నిందితులకు జీవిత ఖైదే
– ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ
– ఆరు నెలల విజిటింగ్ వీసా కింద అమెరికా వెళ్లిన ఎస్ఐబీ మాజీ చీఫ్
– కేసులో సాక్ష్యాలను బట్టి విచారణ వేగవంతం

Phong taping case cyber terrarisam act section 66 (F): దేశంలోనే పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. సాధారణంగా దేశ భద్రతకు సాఫ్ట్‌వేర్ ద్వారా ముప్పు కలిగిస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదవుతాయి. ఇప్పుడు అలాంటి ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్‌ను జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. సెక్షన్ 66(ఎఫ్) కింద కేసు నిరూపణ అయితే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్టు చెబుతున్నారు పోలీసులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఏం తీర్పు ఇవ్వనుందనే ఉత్కంఠ నెలకొంది.

ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పటికే ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆ నోటీసులకు ప్రభాకర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రణీత్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్‌ పేరుతో రాష్ట్రం దాటారు ప్రభాకర్ రావు. ఆపై విదేశాలకు చెక్కేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల విజిటింగ్‌ వీసా మీద అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో మరో నాలుగు నెలల తర్వాతే ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విచారణ వేగవంతం

కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు, ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్‌ సైతం వేశారు. మరోవైపు, ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల(ప్రణీత్‌ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌ రావు) బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే వారి నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?