Kavitha New Party
Politics, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kavitha: కవిత లేఖ తర్వాత కీలక పరిణామం.. తేల్చేసిన కేసీఆర్.. కొత్త పార్టీ పక్కా!?

Kavitha: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖాస్త్రం సంధించిన తర్వాత ఒక్కసారిగా ‘కారు’ పార్టీ కుదుపునకు గురయ్యింది. అసలు కవిత ఏం చేయాలనుకుంటున్నారు? ఆమె మనసులో ఏముంది? అనేది కుటుంబ సభ్యులకే తెలియని, అర్థం కాని పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఈనెల 16న అమెరికా పర్యటనకు వెళ్లిన కవిత శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కవిత రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, మహిళలు భారీగా తరలివచ్చారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఎయిర్‌పోర్ట్ పూర్తిగా నిండిపోయినది.


Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!

Kavitha Flexies


పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు
కవితకు స్వాగతం పలికేందుకు కేవలం మహిళలు, అభిమానులు మాత్రమే రాగా ఎక్కడా బీఆర్ఎస్ నేతలు కనిపించకపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఎక్కడా పార్టీ పేరు లేకుండా కవితకు స్వాగత బ్యానర్లు దర్శనమివ్వడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. అంతకాదు.. కవిత కటౌట్లు తప్ప ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కటౌట్లు కనిపించలేదు. కనీసం గులాబీ బాస్ కటౌట్లు కూడా కనిపించపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమే చోటుచేసుకోబోతోందని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ‘టీమ్ కవితక్క’ అంటూ కటౌట్లు పెద్దఎత్తునే వెలిశాయి. ఇందులో ఎక్కడా గులాబీ, జాగృతి జెండాలు కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. ‘కవిత కొత్త పార్టీ’ అంటూ ఈ పరిస్థితులను బట్టి చూస్తే క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. ‘ సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం.. సుస్వాగతం’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు వెలిశాయి. దీన్ని బట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతోంది.

Kavitha And Kcr

కేసీఆర్ తేల్చేసినట్టేనా?

ఒకవేళ కల్వకుంట్ల ఇంట్లో ఎలాంటి గొడవలు లేకపోతే.. కవిత లేఖ రాసిన విషయం అబద్ధమే అయితే.. ఇంత హడావుడి జరుగుతున్నా కనీసం బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కవితకు స్వాగతం పలకడానికి ఒక్కరంటే ఒక్కరూ బీఆర్ఎస్ నేతలు రాకపోవడమేంటి? గులాబీ జెండాలు కానీ, జాగృతి ప్రతినిధులు కనిపించపోవడమేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. లేఖతో పాటు కుటుంబంలో విబేధాలు అక్షారాలా నిజమే గనుక.. బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు కవితకు దూరంగా ఉంటున్నారనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు.. ఆఖరికి జెండా కనిపించకూడదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని ప్రచారం జోరందుకున్నది. దీన్ని బట్టి చూస్తే.. కవిత ఇక అక్కర్లేదని కేసీఆర్ తేల్చేసినట్టేనా అనే అనుమానాలు వస్తున్నాయి.

Kavitha Press Meet

ఏం మాట్లాడుతారు?
అమెరికా నుంచి వస్తున్న కవిత.. లేఖ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు? అవును లేఖ రాసింది తానేనని ఒప్పుకుంటారా? లేకుంటే లైట్ తీసుకుంటారా? కొత్త పార్టీపై ప్రకటన చేసే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు, శ్రేణులు ఆఖరికి గులాబీ నేతలు కనిపించకపోవడంతో పక్కాగా ‘వేరు కుంపటి’.. అది కూడా అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తున్నది. మరోవైపు కవిత మీడియాతో ఏం మాట్లాడుతారు? లేఖ గురించి స్పందనపై రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అసలు లేఖపై క్లారిటీ ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే కవిత లేఖపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరికి తోచినట్టుగా వారు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల లాగానే కల్వకుంట్ల కుటుంబంలోనూ పరిస్థితులు నెలకొనబోతున్నాయని సమాచారం. షర్మిల కూడా అన్నతో విబేధించి పార్టీ పెట్టడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు ఆంధ్రాలో షర్మిల.. తెలంగాణలో కవిత అంటూ చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయి. చివరికి కవిత ఏం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Read Also- Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ కవిత లేఖ

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు