Mega157: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), త్రిష (Trisha) కాంబినేషన్‌లో వశిష్ఠ రూపొందిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించి 90 శాతం వర్క్ పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ‘విశ్వంభర’ సంగతి ఇలా ఉంటే, ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా అనిల్ రావిపూడితోనే అని అందరికీ తెలిసిందే. ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్‌తో అనిల్ రావిపూడి అల్లాడిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటి నుంచి ఏదో ఒక న్యూస్‌తో ఈ సినిమా (ChiruAnil) ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్‌తో మరోసారి వార్తల్లోకి మెగా157ను తెచ్చేశారు.
Also Read- Meenakshii Chaudhary: పట్టుచీర కట్టాను.. మల్లెపూలు పెట్టాను.. రారా రారా!
బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకెళుతోన్న విషయం తెలియంది కాదు. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అనిల్.. ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. అందులోనూ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న హ్యూమరస్ పాత్రలో చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) నటించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read- Vishal and Sai Dhanshika: విశాల్, సాయి ధన్షికల ప్రేమ వెనుక ఇంత కథ ఉందా?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. శుక్రవారం (మే 23) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు ఈ సినిమాతో తెరపడితే.. చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంతే ఆసక్తితో ఉన్నారు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో వదిలి.. మరోసారి తన మార్క్‌ని ప్రదర్శించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. రాబోయే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్‌తో మెగా157 ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు