Vishal and Sai Dhanshika
ఎంటర్‌టైన్మెంట్

Vishal and Sai Dhanshika: విశాల్, సాయి ధన్షికల ప్రేమ వెనుక ఇంత కథ ఉందా?

Vishal and Sai Dhanshika: గత వారం రోజులుగా హీరో విశాల్ పెళ్లికి సంబంధించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. గత వారం అనే కాదు, అంతకు ముందు కూడా విశాల్ పెళ్లిపై ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీ మీనన్, అనీషా.. ఇలా విశాల్ పెళ్లి విషయంలో ఎన్నో పేర్లు వినిపించాయి. వీరిలో అనీషాతో మాత్రం నిశ్చితార్థం వరకు మ్యాటర్ వెళ్లింది కానీ, ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఫైనల్‌గా ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్షికతో విశాల్ పెళ్లి కన్ఫర్మ్ అయింది. సాయి ధన్షిక కూడా విశాల్‌తో పెళ్లి విషయాన్ని పబ్లిగ్గా కన్ఫర్మ్ చేసింది. వీరిద్దరూ ఆగస్ట్ 29వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లుగా స్వయంగా ఆమెనే ప్రకటించింది.

Also Read- Gamblers: సంగీత్‌ శోభన్‌ నిజంగానే పిచ్చెక్కిస్తున్నాడుగా!

విశాల్ పెళ్లి విషయంలో అన్ని పేర్లు వినిపించినప్పుడు కూడా ఆశ్చర్యపోని వారంతా.. సాయి ధన్షిక పేరు ప్రకటించగానే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. కారణం ఇప్పటి వరకు ఒక్క చిత్రంలో కూడా వాళ్లిద్దరూ కలిసి నటించలేదు. నడిఘర్ సంఘం భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు, పర్యవేక్షించేందుకు విశాల్ ఏర్పాటు చేసిన యూనిట్‌లో కూడా ఎక్కడా సాయి ధన్షిక పేరు లేదు. వీరిద్దరూ కలిసి కనబడినట్లుగా కూడా ఇప్పటి వరకు ఎక్కడా వార్తలు రాలేదు. వీరి మధ్య అంతగా పరిచయం, ప్రేమ అనేవి లేవని అందరికీ తెలుసు. ఈ క్రమంలో అసలు వీరిద్దరూ ఎలా ప్రేమలో మునిగిపోయారన్నది నెటిజన్ల, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇవాళ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఒక చోట కాకపోతే ఇంకో చోట అయినా వారిద్దరూ కనిపించేవారు. అది ఇంత వరకు జరగలేదు. వారిద్దరూ ప్రకటించే వరకు కూడా సాయి ధన్షిక పేరు ఎవరికీ తెలియదు.

Also Read- Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు

దీంతో వాళ్లిద్దరూ అసలు ఎక్కడ, ఎలా కలిశారు అనే దానిపై అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ సెర్చింగ్‌లో అందరూ ఆశ్చర్యపోయే విషయం తెలిసింది. అదేంటంటే.. విశాల్, సాయి ధన్షికలను కలిపింది ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో శింబు తండ్రి అయిన సినీ దర్శక హీరో, నిర్మాత టి. రాజేందర్ (టీఆర్) అని అంటున్నారు. ఎలా అంటే, 2017లో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్‌లో టీఆర్‌తో సహా సాయి ధన్షిక కూడా అతిథిగా ఆ వేడుకకు హాజరైంది. స్టేజ్‌‌పై తను మాట్లాడే సమయంలో టీఆర్ పేరును ప్రస్తావించడం విస్మరించింది. ఇది టీఆర్‌కు కోపాన్ని తెప్పించడంతో.. అదే వేదికపై ధన్షికను ఏకీపారేశారు. దీంతో భయపడిపోయిన ధన్షిక, వెంటనే అదే వేదిక నుంచి టీఆర్‌కు క్షమాపణలు చెప్పింది. అయినా కూడా ఆయన శాంతించలేదు. అప్పట్లో ఇదొక పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలోనే ధన్షికకు అనేక మంది నటీనటుల మద్దతు కూడా లభించింది. అలా మద్దతు ఇచ్చిన వారిలో విశాల్ ఒకరు. అప్పుడు నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్, ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా, ప్రేమగా మారిందని, నాటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్నది తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మ్యాటర్. సో.. విశాల్, సాయి ధన్షికల ప్రేమకి కారణం ఎవరో తెలిసిందిగా..!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!