Meenakshii Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్‌లో లీడింగ్, ట్రెండింగ్.. ఇంకా ఏది ఉంటే అది ఉన్న హీరోయిన్ ఎవరంటే.. కచ్చితంగా అందరూ మీనాక్షి చౌదరి పేరే చెబుతారు. స్టార్, మీడియం, చిన్న హీరోలు ఇలా అందరితో సినిమాలు చేస్తూ బిజీ నటిగా మారిపోయింది మీనాక్షి. రష్మికా మందన్నా పాన్ ఇండియాకు వెళ్లిపోయిన తర్వాత టాలీవుడ్‌లో ఏర్పడిన గ్యాప్‌ని మీనాక్షి చౌదరే చూసుకుంటుందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు రష్మిక, పూజా హెగ్డే, శ్రీలీల పేర్లు టాలీవుడ్‌లో బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ ముగ్గురు ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు వన్ అండ్ ఓన్లీ, బెస్ట్ ఆప్షన్‌గా మీనాక్షి చక్రం తిప్పుతోంది. దీని కోసం ఆమె చాలానే కష్టపడుతోంది.
Also Read- Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏదో రకంగా కాంట్రవర్సీ కోరుకుంటున్నాడా?
ఈ భామకి ఉన్న మరో విశేషం ఏమిటంటే లక్. అవును, మీనాక్షి పట్టిందల్లా బంగారం అవుతుంది. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్న మీనాక్షి, అంతకు ముందు ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) తోనూ భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. అలా సక్సెస్ కూడా లక్కీగా కలిసి వస్తుండటంతో, దర్శకనిర్మాతలు ఈ మీనూ కోసం క్యూ కడుతున్నారు. అంతే, ఒక్కసారిగా ఆమె డిమాండ్ పెరిగిపోయింది. చేతినిండా సినిమాలు ఉన్నాయి కదా.. అని ఈ భామ ఏం ఖాళీగా ఉండటం లేదు.. ఎవరిని ఏ విధంగా ఎంటర్‌టైన్ చేయాలో కూడా బాగా తెలుసుకుంది. అందుకు అనుగుణంగానే ఎప్పటి కప్పుడు మారిపోతుంది. దర్శకనిర్మాతలకు హాట్ బ్యూటీగా మారిన మీనాక్షి.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులని, ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారుని, హాట్ ఫోజులతో నెటిజన్లని ఎప్పటికప్పుడు అటెన్షన్‌లో ఉంచుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అయితే అన్నివర్గాల వారిని ఇట్టే ఆకర్షిస్తోంది.
Also Read- Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?
ఇంతకీ ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? చక్కగా నిండైన చీరకట్టులో కనిపించి, ఈ విధంగానూ రెచ్చగొట్టవచ్చని నిరూపిస్తుంది. వెనుక క్లాసిక్ తెలుగు సినిమాలోని మ్యూజిక్ ప్లే అవుతుండగా, పట్టుచీర కట్టి, జాడనిండా మల్లెపూలు పెట్టి కూల్ లుక్‌లో కనిపించిన మీనాక్షి.. ఒక్కసారిగా చేతులు చాచి.. రా రా అన్నట్లుగా పిలుస్తుండటం చూస్తుంటే.. నెటిజన్లంతా మన్మథులవుతున్నారు. అంతా లవ్ సింబల్స్‌తో, లైక్స్‌తో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి ఇదంతా మీనాక్షి ఎందుకు చేసినట్లో.. అనేది అయితే అర్థం కాలేదు. కొంపతీసి ఈ భామ కూడా ఏమైనా ప్రేమలో పడిందా? ఏంటి? అనేలా కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. వారు అంటున్నారని కాదులే కానీ, నిజంగా ఈ వీడియోలో హాట్‌గా, క్యూట్‌గా మీనాక్షి మెస్మరైజ్ చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు