Anantapur News (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Anantapur News: జగన్ ఫొటో ఎఫెక్ట్.. అధికారిపై ప్రభుత్వం బదిలీ వేటు

Anantapur News: అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కార్యాలయంలో జగన్ ఫొటో ఉండటం రాజకీయంగా దుమారం రేపింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలకు ఉపక్రమించింది.

అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డిపై బదిలి వేటు పడింది. తదుపరి పోస్టింగ్ వచ్చేంతవరకూ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ ఛాంబర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెస్ రాజు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: CM Revanth On KCR: అసెంబ్లీకి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం.. కేసీఆర్‌కు సీఎం విజ్ఞప్తి

రెస్ట్ రూమ్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంతో జడ్పీ సీఈఓపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ నిబంధన ప్రకారం చైర్ పర్సన్ మాజీ సీఎం జగన్ ఫోటో ఉంచారంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో తొలగించి ఆ స్థానంలో సీఎం చంద్రబాబు, మహాత్మా గాంధీ ఫోటోలను పెట్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డిపై వేటు పడటం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

Also Read This: TDP on Jagan: మీరు తెచ్చిన బ్రాండ్లు.. మీరే మర్చిపోతే ఎలా.. జగన్‌పై టీడీపీ సెటైర్లు!

 

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం