TDP on Jagan: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ముమ్మర దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ (YS Jagan).. మద్యంలో ఎలాంటి కుంభకోణం (AP Liqour Scam) జరగలేదని పేర్కొన్నారు. కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి.. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అసలు స్కామ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే జరుగుతోందని అన్నారు. అయితే కొత్త మద్యం బ్రాండ్లపై జగన్ చేసిన కామెంట్స్ ను తనదైన శైలిలో టీడీపీ తిప్పికొట్టింది. సైటెర్లు వేస్తూ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జగన్ ఏమన్నారంటే
మద్యం స్కామ్ తో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. ఎప్పుడు వినని.. చూడని బ్రాండ్లను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు. సుమో, కేరళ మాల్ట్, రాయల్ ల్యాన్సమ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ వంటి బ్రాండ్లను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని వాటి ఫొటోలను మీడియాకు చూపిస్తూ విమర్శలు గుప్పించారు.
టీడీపీ రివర్స్ అటాక్!
కొత్త మద్యం బ్రాండ్లపై జగన్ చేసిన విమర్శలను టీడీపీ సెటైరికల్ గా తిప్పికొట్టింది. జగన్ చెప్పినవన్నీ.. గతంలో వైసీపీ హయాంలో వచ్చినవేనని ఆరోపించింది. ‘మద్యం స్కాం చేసుకోవటానికి నువ్వు తెచ్చిన జే బ్రాండ్లు, నువ్వే మర్చిపోతే ఎలా జగన్?’ అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. అంతేకాదు ఈ పోస్ట్ కు ఓ వీడియోను సైతం జత చేసింది. అందులో జగన్ ఒక్కో బ్రాండ్ పేరు తీసి చదువుతుండగా.. అది జగన్ హయాంలోనే వచ్చినట్లుగా కొన్ని ఆధారాలు చూపించింది. ‘ఇదీ మనదే.. ఇది కూడా మనదే’ అంటూ ‘నాయక్’ సినిమాలో పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) చెప్పే డైలాగ్ ను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ పొలిటికల్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
మద్యం స్కాం చేసుకోవటానికి నువ్వు తెచ్చిన జే-బ్రాండ్లు, నువ్వే మర్చిపోతే ఎలా @ysjagan ? #LiquorScamByJagan#ScamsterJagan#YCPScams#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/zd7OIkpWZd
— Telugu Desam Party (@JaiTDP) May 22, 2025
ఇంకా జగన్ ఏమన్నారంటే!
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో అధిక ధరలకు మద్యం విక్రయించారన్న ఆరోపణలను ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని జగన్ చెప్పారు. 12 నెలల కాలంలో రాష్ట్రంలో లిక్కర్ సేల్ బాగా పెరిగిందని అన్నారు. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని.. బియ్యానికి బదులుగా మద్యాన్ని డోర్ డెలివరీలు చేస్తున్నారని జగన్ అన్నారు. గతంలో లేని కొత్త బ్రాండ్లను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు.