Bellamkonda Sai Sreenivas
ఎంటర్‌టైన్మెంట్

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏదో రకంగా కాంట్రవర్సీ కోరుకుంటున్నాడా?

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో ఇద్దరు హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్‌తో కలిసి నటించిన చిత్రం ‘భైరవం’. ఈ సినిమా మే 30న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మెయిన్ హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినబడుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతున్న మాటలు కాంట్రవర్సీగా మారుతున్నాయి. మరి కావాలని చేస్తున్నాడో, లేదంటే స్పాట్‌లో అలా వచ్చేస్తున్నాయో తెలియదు కానీ, తాజాగా ఆయన సుమతో చేసిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడుస్తోంది.

Also Read- Vishal and Sai Dhanshika: విశాల్, సాయి ధన్షికల ప్రేమ వెనుక ఇంత కథ ఉందా?

ప్రస్తుతం ఈ బెల్లంకొండ హీరోకి అర్జెంట్‌గా హిట్ కావాలి. ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. రాజమౌళి, ప్రభాస్‌ల ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ‘భైరవం’ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయించి తన పరువు కాపాడుకోవాలని చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆయన చర్యలు. మొన్న ట్రాఫిక్ పోలీస్‌పైకి కారుని పోనిచ్చి వివాదంలో నిలిచిన బెల్లంకొండ బాబు.. ఇప్పుడు పెళ్లి విషయంలో ఇండస్ట్రీ మొత్తాన్ని కెలికిపడేసి వార్తలలో నిలుస్తున్నాడు. ఈ హీరోని మొదటి నుంచి గమనించిన వారెవ్వరూ, ట్రాఫిక్ పోలీస్‌పైకి కారుని పోనిచ్చాడంటే నమ్మరు. ఎందుకంటే, ఆయన మొదటి నుంచి కామ్ గోయింగ్ అన్నట్లుగా తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. మరి ఎందుకిలా చేశాడనేది మాత్రం ఇంత వరకు తెలియలేదు. ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేసి, కారుని సీజ్ కూడా చేశారు.

Also Read- Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?

ఈ విషయం తర్వాత ఎవరైనా సరే, బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉండేవారు. కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ‘భైరవం’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తనపై కేసు నమోదు అయిందనే విషయాన్ని ఆయన ఎప్పుడో మరిచిపోయాడని అనిపిస్తుంది ఆయనని చూస్తుంటే. అంతేకాదు, అదంతా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన జిమ్మిక్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో కాంట్రవర్సీలో తల పెట్టాడు. అదీ కూడా పక్కన రెండు పెళ్లిళ్లు చేసుకున్న మంచు మనోజ్‌ని పెట్టుకుని. మీ పెళ్లి ఎప్పుడు? అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పెళ్లి గురించి చెప్పడానికి ఏమీ లేదు.. అంతా డాడీనే చూసుకుంటారు’ అని చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ వెంటనే ‘కొంతమంది హీరోలను ఆదర్శంగా తీసుకుని రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చాడు. అంతే, ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు? అని టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోల పేర్లను తెరమీదకు తెస్తూ.. వారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా అయితే, ఈ కాంట్రవర్సీతో ‘భైరవం’ సినిమా వార్తలలో అయితే బాగానే నిలుస్తోంది. అదీ విషయం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!