Miss Indonesia( image credit: twitter)
తెలంగాణ

Miss Indonesia: నంబర్ వన్ మిస్ ఇండోనేషియా.. ముగిసిన వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్!

Miss Indonesia: మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో 72 ఎడిషన్ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ ఈవెంట్స్ అద్భుతంగా జరిగాయి. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్ గా (పియానో) నిలిచారు. రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్), మూడో స్థానంలో మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) నిలిచారు.

అయితే ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన ‘రాను బొంబయికి రాను’.. తెలంగాణ జానపద పాటకు మిస్ నైజీరియా, ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ టాలెంట్ కు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఇండోనేషియా పోటీదారు పియానో మ్యూజిక్ తో అలరించారు. ఫ్లోర్ డాన్స్ ద్వారా ఎస్టోనియా కంటెస్టెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఐ లవ్ స్టోరీస్’అనే అద్భుత గీతం పాడిన బ్రెజిల్ అందాల భామలు మైమరించారు.

Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్ పనైపోయింది.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

ఐస్ స్కేటింగ్ తో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. నెదర్లాండ్ కు చెందిన చెక్ రిపబ్లిక్ సుందరీమణి కూడా పియానోపై తన సత్తా చాటారు. అర్బన్ డాన్స్ మూవ్ మెంట్స్ తో అర్జెంటీనా కాంటెస్టెంట్ ఆకట్టుకున్నారు. సంప్రదాయ సింహళి నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్ ను ప్రదర్శించారు. ట్రినిటాడ్ కంటెస్టెంట్ ఏరోబిక్స్ ప్రదర్శనతో మెప్పించారు.

వేల్స్ కంటెస్టెంట్ అత్యవసరమైన సమయాల్లో రోగులను కాపాడే కార్డియో పల్మనరీ రెససిటేషన్ (సీపీఆర్) ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించి శెభాష్ అనిపించుకున్నారు. కెన్యా కాంటెస్టెంట్ జుంబా డీజే ద్వారా ఉర్రూతలూగించింది. ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ తో ఆహుతులను కట్టిపడేశారు. లాస్ట్ కు పోటీదారులంతా ‘రాను బొంబాయికి రాను’అంటూ తెలుగు పాట కి స్టేజీ పై దద్ద రిల్లే పెర్ఫార్మన్స్ చేశారు.

Also Read: Case on Bellamkonda: టాలీవుడ్ హీరోకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో కేసు నమోదు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!