Vijay Kanakamedala
ఎంటర్‌టైన్మెంట్

Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు

Vijay Kanakamedala: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో 2011లో పోస్ట్ అయిన ఒక పోస్ట్‌ని మెగా ఫ్యాన్స్‌ని హర్ట్ చేసేలా ఉండటంతో.. ఆయనపై భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. సినిమా విడుదల వేళ, ఇలాంటి కాంట్రవర్సీలో చిక్కుకున్నందుకు దర్శకుడు ఎంతగానో ఫీలవుతున్నారు. ఈ మేరకు ఆయన మెగాభిమానులను క్షమాపణలు కోరుతూ.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. అందులో.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

‘‘నమస్కారం, అందరికీ గుడ్ ఈవెనింగ్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న ‘భైరవం’ ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు వరకు కూడా మెగా అభిమానులు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. బహుశా హ్యాకై ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నాకు ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్‌ని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకోమన్నారు. తేజ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు.

అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి, పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ, మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మీ విజయ్ కనకమేడల’’ అని దర్శకుడు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read- Peddi: ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కి పండగే!

2011లో విజయ్ కనకమేడల చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. మెగాస్టార్ చిరంజీవి బోల్డ్ హెడ్‌లో ఉండగా.. ఆయనని రామ్ చరణ్ భుజాలపై ఎక్కించుకుని తీసుకెళుతున్నట్లుగా ఓ పిక్ చేసి, ‘సామాజిక న్యాయం ప్రెజెంట్స్ ‘ఛా..’ అని ఓ పోస్టర్ పెట్టారు. ఈ పోస్టర్‌లో నిర్మాత, దర్శకత్వం అల్లు అరవింద్ అనేలా ఉంది. ఈ పోస్ట్‌ని బయటకు తీసిన అభిమానులు.. ఇది నీ క్యారెక్టర్ అంటూ గట్టిగానే ఏసుకుంటున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఎంత దూరం వెళుతుందో చూడాలి. క్షమాపణలు కోరాడు కాబట్టి.. మెగాభిమానులు ఏమైనా శాంతిస్తారేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!