BRS Harish Rao( image credit: twitter)
తెలంగాణ

BRS Harish Rao: దేశానికి ఆదర్శంగా తెలంగాణ.. మాజీ మంత్రి హరీష్ రావు!

BRS Harish Rao: తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. 2015లో తలసరి జీఎస్‌వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిందన్నారు. ఎక్స్ వేదికగా బుధవారం నివేదిక రిపోర్టును పోస్టు చేశారు.

తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8% సీఏజీఆర్‌తో ఈ పురోగతి సాధ్యమైందన్నారు. ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని, ఇది సమర్థవంతమైన పాలన, ధీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపిన సాక్ష్యం అని పేర్కొన్నారు.

Also Read: Crime News: మహిళా డాక్టర్​పై.. మరో డాక్టర్ అత్యాచారం!

అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారని, వాస్తవంగా దివాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన ఆలోచనలే అని మండిపడ్డారు. ఈ నిరూపిత విజయాలను విస్మరించి, బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని వెల్లడించారు.

Also Read: Phone Tapping Case: ప్రభాకర్ రావుకు బిగుసుకుంటున్న ఉచ్చు.. అదే జరిగితే ప్రభాకర్​ రావు ఆస్తులు సీజ్!

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే