Crime News: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిపిన డాక్టర్ ఉదంతమిది. తీరా వివాహం చేసుకొమ్మంటే సదరు డాక్టర్ మొహం చాటేయటంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ స్వామి మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో పని చేస్తున్న ఓ మహిళా వైద్మురాలితో అతనికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది.
Also Read: Etela Rajender: బెదిరిస్తే భయపడం.. సీఎంకు ఎంపీ ఈటల సవాల్!
ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన డాక్టర్ స్వామి ఇటీవల హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్ లోని ఓ న్రముఖ హోటల్ కు పిలిపించుకున్నాడు. అక్కడ మహిళా డాక్టర్ పై అఘాయిత్యం జరిపాడు. ఆ తరువాత మహిళా డాక్టర్ తో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకొమ్మని అడిగితే చేసుకోనని చెప్పాడు. దాంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Rajiv Gandhi Death Anniversary: రాజీవ్ గాంధీ చొరవతోనే.. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు!