RGV: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచిగా సినిమాలు తీసే ఈ డైరెక్టర్ గత కొన్నేళ్ళ నుంచి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత మంది ఉంటే.. అంత మంది మీద కామెంట్స్ చేయడం, ట్వీట్లు పెట్టడం, అసభ్య పదజాలంతో మాట్లాడటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలనే ఉన్నాయి.
ఇన్ని చేస్తున్నా కూడా .. పైకి ఏ తప్పూ చేయని వాడి లా ఉంటాడు. ఇక స్టార్ హీరోయిన్స్ అందాలను పొగుడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్ మీద అసభ్య కామెంట్స్ చేశాడు.
ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడిన దానిలో డబుల్ మీనింగ్ అర్ధం వచ్చేలా మాట్లాడతాడు. ఇదేంటి అని అడిగిన వాళ్ళకి .. నా మాటలు నా ఇష్టం మని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అంతే కాదు, ఆ మాటల్లో కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండే పెద్ద స్టార్స్ గురించి పోస్టులు పెడుతూ.. ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.
Also Read: Prabhas: వామ్మో ఏంటి ఇది.. ప్రభాస్, బబ్లూ పృథ్వీరాజ్ సాంగ్ ని కాపీ కొట్టాడా?
మే 20 నా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 టీజర్ విడుదల చేశారు. అయితే, ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటలకే ఆర్జీవీ కియారా అద్వానీకి హాట్ ఫోటోలు షేర్ చేసి బోల్డ్ కామెంట్స్ చేశాడు.