BRS on Cm Revanth Reddy: అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ ఆరోపించారు. తెలంగాణభవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎంకు గిరిజన ఆదివాసీల పై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖ ను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. సీఎం చెబుతున్న 24 గంటల కరెంటు బోగస్ గా మారిందన్నారు. రుణమాఫీ సరిగా జరగలేదన్నారు.
రైతు భరోసా ఇంకా పూర్తి చేయలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు?తులం బంగారం ఏమైంది ? పెన్షన్లను పెంచుతాం అని ఎందుకు పెంచలేదు? కేసీఆర్ కిట్ ,న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేశారని నిలదీశారు. అబద్దపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలను గిరిజన ఆదివాసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పాలనలో గిరిజన ఆదివాసీలకు ఇచ్చిన పట్టాలనే రేవంత్ రెడ్డి ఇస్తున్నారని, చేతనైతే కొత్తగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Notices to KCR: కాళేశ్వరం కమిషన్ దూకుడు.. కేసీఆర్‌కు నోటీసులు.. విచారణకు వెళ్తారా?
ఆదివాసీ గూడేలు ,గిరిజన తండాల్లో రోడ్లు పాడైతే బాగు చేసే పరిస్థితి లేదన్నారు. సీఎం అబద్దపు మాటలు మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లో నిర్వహించిన సభ కాంగ్రెస్ శ్రేణుల సభగా మారిందన్నారు. దళిత ,గిరిజన ,ఆదివాసీలకు సీఎం సభ లో సముచిత స్థానం ఇవ్వలేదని మండిపడ్డారు. చెంచుల గొంతు నొక్కారన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి చెంచులకు అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్ పాలనలో 6లక్షల మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ డిక్లరేషన్లు అలంకార ప్రాయంగా మారాయన్నారు. రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ దిగివచ్చినా నల్లమల సంపదను తరలించుకు పోనివ్వం అన్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందన్నారు. కేసీఆర్ పాలనలో గిరిజన,ఆదివాసీలకు న్యాయం దక్కిందన్నారు. రేవంత్ మాయమాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన ఆదీవాసీ ఓట్ల తోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందన్నారు. అధికారం లోకి రాగానే వారి సంక్షేమాన్ని మరిచారన్నారు. గిరిజన ఆదివాసీలు ఈ సారి కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
Also Read: RV Karnan: ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి.. అధికారులకు కర్ణన్ కీలక ఆదేశాలు!