CI Suspended: వరంగల్‌ల్లో రక్షక బటుడే రాక్షసుడయ్యాడు. కన్ను మిన్ను కనకుండా అందినకాడికి దండుకుని బాధితులకు అన్యాయం చేసి ఏకంగా ఓ మృతిపై కేసు నమోదు చేశాడు. వరంగల్ లో సంచలనం రేపిన ఓ హత్య కేసులో నిందితురాలు పై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలతో మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
సదరు ఇన్స్పెక్టర్ మిన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదం కేసులో పోలీసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసి నిందితులకు సహకరించారు.
Also Read: Plastic Usage: విచ్చలవిడిగా సాగుతున్న ప్లాస్టిక్ వినియోగం.. ఉత్తమాటగా మారిన నిషేధం!
అలాగే వరంగల్‌లో సంచలనం సృష్టించిన మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు.