Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి రంగం సిద్ధమవుతోంది. ఎవరెన్ని విధాలుగా అడ్డుపడినా, ఈ షో మాత్రం ఆగదు అనేలా.. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోపై ఇప్పుడు రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా హోస్ట్ కింగ్ నాగార్జున విషయంలో బిగ్ బాస్ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీక్షకులనే కాకుండా బిగ్ బాస్ షో యాజమాన్యాన్ని కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. సరైన కంటెస్టెంట్స్ లేకపోవడం, ముందుగానే లీకవడం వంటి వాటితో.. సీజన్ 8 ప్రజాదరణను అందుకోలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ల కంటే దారుణమైన రేటింగ్‌ని అందుకున్నట్లుగా కూడా టాక్ వచ్చింది. కొన్ని ఎపిసోడ్స్ మినహా, మిగతా అన్ని ఎపిసోడ్స్ మినిమమ్ రేటింగ్ కూడా రాబట్టలేకపోయిందని అప్పట్లో గట్టిగానే టాక్ నడిచింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సారి సీజన్ 9ను సరికొత్తగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు టీమ్ కసరత్తులు చేస్తుందని తెలుస్తోంది.
Also Read- Balayya and Mansion House: బాలయ్యని అలా అపార్థం చేసుకోకండి.. పూర్తిగా చూడండయ్యా!
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 6 సీజన్ల హోస్ట్‌గా చేసిన కింగ్ నాగార్జునను ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం పక్కన పెట్టేస్తుందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ 9ని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కానీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లేదంటే రానా దగ్గుబాటి (Rana Daggubati) హోస్ట్ చేస్తారనేలా టాక్ నడుస్తుంది. కొందరైతే నందమూరి బాలకృష్ణ దాదాపు కన్ఫర్మ్ అనేలా వార్తలు సృష్టించేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ విషయానికి సంబంధించి ఓ కీలక అప్డేట్‌ని బిగ్ బాస్ టీమ్ ఇచ్చింది. రాబోయే సీజన్‌ను హోస్ట్ చేసేది ఎవరో క్లారిటీ వచ్చేసింది. సీజన్ 9 హోస్ట్ ఎవరంటే.. కింగ్ నాగార్జున. అవును, ఈసారి కూడా కింగ్ నాగార్జునే (King Nagarjuna) బిగ్ బాస్ సీజన్ 9ను హోస్ట్ చేయబోతున్నారు. సీజన్ 9కి సంబంధించి కింగ్ నాగార్జునతో ఒప్పందం పూర్తయిందని, ఈ సీజన్‌కు నాగార్జున భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడనేలా వార్తలు బయటకు వచ్చాయి.
Also Read- Jr NTR Birthday: తారక్ బర్త్‌డే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్!
మరోవైపు కింగ్ నాగార్జున వద్దనుకుంటే తప్ప.. ఆయనను ఈ షో నుంచి తప్పించే ధైర్యం ఎవరూ చేయలేరనేలా అక్కినేని అభిమానులు పోస్ట్‌లు చేస్తుండటం విశేషం. షో జరిగే ప్రదేశం నాగార్జున కనుసన్నల్లో ఉంటుంది. అలాంటిది నాగ్‌ని కాదని ఈ షోని నడపగలరా? అనేలా వారు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విషయానికి వస్తే, సెప్టెంబర్ నుంచి ఈ సీజన్ మొదలు కానుంది. ప్రస్తుతం క్రియేటివ్ టీమ్ సరికొత్త ఆలోచనలతో, ఈసారి ప్రేక్షకుల ఆదరణను ఎలాగైనా పొందాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి అంతగా పేర్లు బయటకు రాలేదు కానీ, ఒక్క పేరు మాత్రం బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బంఛిక్ బబ్లూ పేరు ఫైనల్ అయినట్లుగా టాక్ నడుస్తుంది. ఈసారి కాస్త పేరున్న సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించాలని, చివరి వరకు కంటెస్టెంట్స్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేయాలని టీమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం.. ఎంత వరకు దాచగలరో..!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు